Delhi Municipal Election: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 4న ఎన్నికలు.. 7న ఫలితాలు

ఢిల్లీలో ఎన్నికల సమరం మొదలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిసెంబర్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.

Delhi Municipal Election: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 4న ఎన్నికలు.. 7న ఫలితాలు

Delhi Municipal Election: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం… డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు.

Kerala: ఎంత అహంకారం.. కారుకు ఒరిగినందుకు బాలుడిని తన్నిన యజమాని.. వీడియో వైరల్

ఈ నెల 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నవంబర్ 16 నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుంది. నవంబర్ 19 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించి, 7న ఫలితాలు విడుదల చేస్తారు. వార్డుల పునర్విభజన తర్వాత మొత్తం ఢిల్లీ పరిధిలో 250 వార్డులుగా నిర్ణయించారు. వీటిలో 42 వార్డుల్ని షెడ్యూల్డ్ కులాలకు కేటాయించారు. ఈ 42లో 21 సీట్లు మహిళలకు కేటాయించారు. అలాగే మొత్తం సీట్లలో మహిళలకు 104 స్థానాలు కేటాయించారు.

Karnataka: గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. ఇంట్లోనే ప్రసవించి ప్రాణాలు వదిలిన మహిళ.. అప్పుడే పుట్టిన కవలలూ మృతి

నిజానికి ఈ ఎన్నికలు గత ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉంది. అయితే, కేంద్రం మూడు మున్సిపాలిటీలను ఢిల్లీలో కలిపేందుకు ప్రతిపాదించడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ ఏడాది జనవరి 1 వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారికే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం.. ఢిల్లీ పరిధిలో మొత్తం 1.48 కోట్ల ఓటర్లున్నారు.