12 MPs suspension : 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ గాంధీ విగ్రహం ముందు విపక్ష ఎంపీల నిరసన

12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు విపక్ష ఎంపీల నిరసన కొనసాగిస్తున్నారు.

12 MPs suspension : 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ గాంధీ విగ్రహం ముందు విపక్ష ఎంపీల నిరసన

12 Opposition Mps Suspension

12 Opposition MPs suspension : పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు విపక్ష ఎంపీలు నిసనలు చేసున్నారు. మాస్కులు, నల్ల రిబ్బన్లు ధరించి..ఎంపీలు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖార్గేతో పాటు టీఆర్ ఎప్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు కూడా పాల్గొన్నారు.

లోక్​సభ గురువారానికి వాయిదా
మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన లోక్​సభ కార్యకలాపాలు రాత్రి 7.30 వరకు సజావుగా సాగియి. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలను నియంత్రించేందుకు ఉద్దేశించిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగా చేసిన సవరణలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. పలు అంశాలపై చర్చించిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.

రాజ్యసభ వాయిదా..ఉదయం ఎంపీలు నిరసనలు
12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్​పై విపక్షాలు పట్టువీడటం లేదు. ఈ క్రమంలో బుధవారం నాడు సభను గురువారానికి వాయిదా వేశారు. విపక్షాల ఆందోళనల నడుమ కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​.. డ్యామ్​ సేఫ్టీ బిల్లు, 2019ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయినా విపక్షాలు పట్టువీడలేదు. ఆందోళన మానలేదు. దీంతో గందరగోళంతో సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. గత ఏడాది కాలంలో వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా సంభవించిన రైతుల మరణాలపై తమ వద్ద సమాచారం లేదని కేంద్రం వెల్లడించింది. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సమాచారమే లేనప్పుడు సాయం అనేది ఎలా ఉంటుందని అన్నారు.అనంతరం.. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

ఎగువ సభ వాయిదా..వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన రాజ్యసభ కార్యకలాపాలకు మరోసారి ఆటంకం కలిగింది. విపక్షాల ఆందోళనల నడుమ సభను.. 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​.12 మంది ఎంపీల సస్పెన్షన్​ అంశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తిన క్రమంలో నేపథ్యంలో.. సభ వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల నడుమ లోక్​సభ కూడా 12 గంటలకు వాయిదావేశారు స్పీకర్.బుధవారం కాంగ్రెస్​ వాకౌట్​..

లోక్​సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్న సమయంలోనే సభనుంచి కాంగ్రెస్​, డీఎంకే సభ్యులు వాకౌట్​ చేశారు. ఎంపీల నిరసన..సస్పెన్షన్​కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఎదుట నిరసనలకు దిగారు. తమపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్లకార్డులు పట్టుకున్నారు.మాస్కులు, నల్ల రిబ్బన్లు ధరించి..ఎంపీలు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖార్గేతో పాటు టీఆర్ ఎప్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు కూడా పాల్గొన్నారు.