Monkeypox: ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు

దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఢిల్లీలో ఒక మహిళకు మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె అక్కడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇది ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసుకాగా, దేశంలో పదో కేసు.

Monkeypox: ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయన్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల మహిళకు శనివారం మంకీపాక్స్ పాజిటివ్‌గా నమోదైంది. దీంతో ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరగా, దేశవ్యాప్తంగా పదో కేసు నమోదైంది.

Karnataka: అధికారులతో గడిపితేనే మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ఆరోపణ

దేశంలో నమోదైన కేసుల్లో సగం ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. ఈ ఐదుగురిలో ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మిగతా నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం రోగులకు చికిత్స అందిస్తున్నట్లు డా.సురేష్ కుమార్ తెలిపారు. తాజాగా మంకీపాక్స్ సోకిన మహిళకు ఈ మధ్య కాలంలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, అయితే నెల రోజుల క్రితమే ప్రయాణాలు చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే ప్రజలు ఏం చేయాలి.. ఏం చేయకూడదు అంటూ కొన్ని సూచనలు చేసింది. కోవిడ్ లక్షణాలున్న వాళ్లు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది.

Gorantla Madhav Video: గోరంట్ల వీడియో నిజమైనదే.. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చిందన్న టీడీపీ

దాదాపు రెండు వారాల క్రితం కేరళలో మంకీపాక్స్ సోకిన ఒక రోగి మరణించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఒక వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటానికి 6-13 రోజులు పడుతుంది. ఆ తర్వాత 5-21 రోజులపాటు వ్యాధి తీవ్రత ఉండే అవకాశం ఉంది.