ట్రాక్టర్ ట్రక్కా లగ్జరీ ఇల్లా..!! ఆందోళన చేసే హర్యానా రైతు క్రియేటివిటీ చూడాల్సిందే..

ట్రాక్టర్ ట్రక్కా లగ్జరీ ఇల్లా..!! ఆందోళన చేసే హర్యానా రైతు క్రియేటివిటీ చూడాల్సిందే..

Delhi : tractor trolley of haryana farmer is not less than vanity van : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ..ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల్లో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా చలిని కూడా లెక్కచేయకుండా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్న క్రమంలో రైతన్నల క్రియేటివిటీ గురించి ఎన్నో వార్తలు వింటున్నాం. చూస్తున్నాం. అటువంటి మరో రైతు వినూత్న ఏర్పాటు గురించి తెసుకోవాల్సిందే.

ఆందోళనలో పాల్గొనటానికి హర్యానా నుంచి వచ్చిన ఓ రైతు తనతోపాటూ… ఓ ట్రాక్టర్‌ని తెచ్చుకున్నారు. అలా ఎన్ని రోజులు ఈ ఆందోళనలు జరుగుతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ఈక్రమంలో ఎన్నిరోజులు అక్కడ ఉండాల్సి వస్తుందో తెలీని పరిస్థితిలో హర్యానా రైతు తన ట్రాక్టర్ ట్రాలీని ఇల్లులా మార్చేసుకున్నారు.

హర్యానాలోని రతియా ప్రాంతానికి చెందిన ఆ రైతన్న తన ట్రాక్టర్ ట్రాలీని అన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లుగా మార్చేశాడు. ఆ ట్రాక్టర్ ట్రాలీ ఇల్లు చూస్తే ఇది ట్రాలీయా లేక లగ్జరీ ఇల్లా అన్నట్లుగా ఉంది.

ఈ ట్రాక్టర్ ట్రాలీ ఇల్లులో టీవీ, రూమ్ హీటర్, దుప్పట్లు, దిండ్లు అన్నీ ఉన్నాయి. బయటి వైపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, గ్యాస్ గీజర్, వాటర్ ట్యాంక్, పోర్టబుల్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ ట్రాక్టర్‌లో ఓ డబుల్ బ్యాటరీ ఇన్వెర్టర్ కూడా ఉంది. దాని ద్వారా లోపల కరెంటు సమస్య అనేదే లేదు. అలాగే… డీజిల్-పెట్రోల్‌తో పనిచేసే పవర్ జనరేటర్ కూడా ఉండటం మరో విశేషం.