Delhi Water Supply: ఢిల్లీలో నీటి కొరత.. భారీగా తగ్గిన సరఫరా

దేశ రాజధాని ఢిల్లీ నీటి కొరతతో అల్లాడుతోంది. ఢిల్లీలోని ఉత్తర, వాయువ్య, పడమర, దక్షిణ ప్రాంతాలకు నీటి సరఫరా భారీగా తగ్గిపోయింది. వజిరాబాద్ సరస్సులో నీటి మట్టం భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం.

Delhi Water Supply: ఢిల్లీలో నీటి కొరత.. భారీగా తగ్గిన సరఫరా

Delhi Water Supply

Delhi Water Supply: దేశ రాజధాని ఢిల్లీ నీటి కొరతతో అల్లాడుతోంది. ఢిల్లీలోని ఉత్తర, వాయువ్య, పడమర, దక్షిణ ప్రాంతాలకు నీటి సరఫరా భారీగా తగ్గిపోయింది. వజిరాబాద్ సరస్సులో నీటి మట్టం భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. సగటున 674 అడుగుల నీటి మట్టం ఉండాల్సిన ఈ సరస్సులో ప్రస్తుతం 668 అడుగల మేరకే నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో నీటి సరఫరా కష్టమవుతోంది.

Soldier Honey-Trap: హనీట్రాప్‌లో సైనికుడు.. పాక్ యువతికి రహస్య సమాచారం చేరవేత

ఇప్పటికే యమునా నది దాదాపు పూర్తిగా ఎండిపోయింది. దీంతో క్యారియర్ లైన్డ్ కెనాల్ (సీఎల్‌సీ), ఢిల్లీ సబ్ బ్రాంచ్ (డీఎస్‌బీ) నుంచి వజిరాబాద్‌కు నీటిని మళ్లిస్తున్నారు. దీంతో హైదర్‌పూర్ ఫేజ్-1, ఫేజ్-2తోపాటు బవానా వాటర్ ప్లాంట్స్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుత పరిస్థితి మెరుగయ్యేంత వరకు తక్కువ స్థాయిలోనే నీటి సరఫరా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా సీఎల్‌సీ, డీఎస్‌బీ, యమునా నది నుంచి రోజుకు 310 మిలియన్ల గ్యాలన్ల నీళ్లు ఢిల్లీకి సరఫరా అవుతాయి.

Death Penalty: సొంత చెల్లెలి పరువు హత్య.. ముగ్గురికి మరణ శిక్ష

అయితే, ప్రస్తుతం అన్ని వైపుల నుంచి నీటి సరఫరా తగ్గిపోయింది. తమ రాష్ట్రానికి నీటి సరఫరా పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం హరియాణాకు లెటర్ రాసింది. దీనిపై స్పందించిన హరియాణా ప్రభుత్వం నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దని, నీళ్లు కావాలంటే పంజాబ్‌ను అడగాలని సూచించింది.