Delhi : ‘ఫ్రీ థాలీ’ ఆఫర్ నమ్మి రూ.90,000 పోగొట్టుకున్న మహిళ

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని అట్రాక్ట్ చేసేందుకు ఫ్రీ ఆఫర్ల పేరుతో మోసం చేస్తున్నారు. వాళ్ల ఆఫర్లకు ఆకర్షితులై తమ ఖాతాల్లో వేల రూపాయలు పోగొట్టుకుని జనం గగ్గోలు పెడుతున్నారు. 'ఫ్రీ థాలీ' ఆఫర్ పేరుతో ఓ మహిళ రూ.90,000 పోగొట్టుకుంది.

Delhi : ‘ఫ్రీ థాలీ’ ఆఫర్ నమ్మి రూ.90,000 పోగొట్టుకున్న మహిళ

Delhi

Delhi Cyber ​​Fraud : ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ఏదైనా ఉచితం అని చెబితే వెంటనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న శ్రీమతి శర్మ ఫ్రీ థాలీ ఆఫర్ నమ్మి సైబర్ మోసంలో రూ.90,000 పోగొట్టుకున్నారు. ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.

Cyber Fraud : గిఫ్ట్‌లకు ఆశపడ్డారు, రూ.25లక్షలు పోగొట్టుకున్నారు.. సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం

ఢిల్లీలో ‘ఒక థాలీ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి’.. ఈ ఆఫర్ శ్రీమతి సవితా శర్మను అట్రాక్ట్ చేసింది. ఆవిడ బ్యాంక్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆమె తరపు బంధువులు ఒకరు ఫేస్ బుక్‌లో చూసిన ఈ ఆఫర్ గురించి చెప్పారట. వెంటనే శర్మ సైబర్ క్రూక్స్ అడిగిన యా‌ప్‌ను డౌన్ లోడ్ చేశారు.. అంతే .. రూ. 90,000 పోగొట్టుకున్నారు. చేసేది లేక సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎప్ఐఆర్ నమోదు చేశారు.

 

నవంబర్ 27, 2022లో మిసెస్ శర్మ సైట్‌ను సందర్శించి డీల్ గురించి తెలుసుకోవడానికి అక్కడ ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసారు. ఎటువంటి స్పందన రాలేదు కానీ కాల్ బ్యాక్ అందుకున్నారు. కాలర్ ఆమెను సాగర్ రత్న (ఫేమస్ రెస్టారెంట్ చైన్) ఆఫర్ పొందమని ఒక లింక్‌ను షేర్ చేసి ఆఫర్ పొందడానికి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయమని అడిగారట.. యాప్‌ను యాక్సెస్ చేసేందుకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ కూడా పంపారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందుగా యాప్‌లో ఈ ఆఫర్‌ను నమోదు చేసుకోవాలని చెప్పినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు.

DCP Sneha Mehra : సోషల్ మీడియా, యూట్యూబ్ లో కించపరిచేలా పోస్టింగ్ లు, ట్రోల్ చేస్తే కఠిన చర్యలు : సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా

లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ నమోదు చేయగానే ఫోన్ హ్యాక్ చేయబడినట్లు శర్మ గుర్తించారట. మొదటగా ఆమె క్రెడిట్ కార్డు ఖాతా నుంచి రూ.40,000 .. కొన్ని సెకండ్లలో మరో రూ.50,000 లో విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చిందని శర్మ వాపోయారు. సాగర్ రత్న రెస్టారెంట్ ప్రతినిధులు కూడా మా రెస్టారెంట్ పేరుతో సైబర్ ఫ్రాడ్ జరిగినట్లు కస్టమర్ల నుండి చాలా ఫిర్యాదులు అందాయని అంగీకరించారు. నిత్యం అనేక నగరాల నుంచి ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయని జనం ఇలాంటి ఆఫర్లను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు.