Delta Variant: కొవిడ్-19 శాంపుల్స్‌లో 99శాతం డెల్టా వేరియంట్

ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించిన రీసెంట్ డేటాలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీని ఫలితంగా ఎదుర్కొనే Sars-Cov-2 వైరస్ వేరియంట్ లో మార్పులు మహమ్మారిని వ్యాప్తి పెంచుతుంది.

Delta Variant: కొవిడ్-19 శాంపుల్స్‌లో 99శాతం డెల్టా వేరియంట్

Delta Variant

Delta Variant: ఢిల్లీ గవర్నమెంట్ వెల్లడించిన రీసెంట్ డేటాలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దీని ఫలితంగా ఎదుర్కొనే Sars-Cov-2 వైరస్ వేరియంట్ లో మార్పులు మహమ్మారిని వ్యాప్తి పెంచుతుంది. దేశ రాజధానిలో అక్టోబర్ నెలలో పరీక్షించిన శాంపుల్స్ లో దాదాపు 99శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు వెల్లడించాయి.

కొవిడ్ వచ్చిన వారిని పరీక్షించగా ఏప్రిల్ నెలలో 54శాతం మందిలో డెల్టా ప్లస్ వేరియంట్ కనిపించగా.. మే నెల 82శాతం మందిలో ఉన్నట్లు గుర్తించామని గవర్నమెంట్ డేటా వెల్లడించింది. ఏప్రిల్-మే నెలలో మహమ్మారి ప్రభావం హెల్త్ కేర్ సిస్టమ్ ను వణికించింది. ఏప్రిల్ 20న ఢిల్లీలో 28వేల 395కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మహమ్మారి మొదలైన తర్వాత నమోదయ్యాక అత్యధిక ఒక్క రోజులో కేసులు అవే.

ఢిల్లీ గవర్నమెంట్ డేటా ప్రకారం.. డెల్టా వేరియంట్ శాంపుల్స్ 39శాతం మందిలో కనిపించాయి. గతంలో ఎదుర్కొన్న వేరియంట్ కంటే డెల్టా వేరియంట్ వ్యాప్తి మరింత వేగంగా ఉందని సైంటిస్టుల ఇంటర్నేషనల్ టీం చెప్తుంది. జర్నల్ సైన్స్ లో పబ్లిష్ అయిన దానిని బట్టి.. 30 నుంచి 70శాతం ఎక్కువగా వ్యాప్తి అవుతుందని చెప్పింది.

…………………………………. : మా పాలన గుర్తించండి…తాలిబన్ల విజ్ఞప్తి

తాజాగా జరిగిన సెరో సర్వేలెన్స్ లో దేశ రాజధానిలో 97శాతం మంది జనాభా యాంటీబాడీస్ డెవలప్ అయినట్లుగా తెలిసింది.