Pregnants Delta Risk : గర్భిణులకు అలర్ట్.. పొంచి ఉన్న డెల్టా ముప్పు.. వెంటనే టీకా తీసుకోవాలని సూచన

కరోనా కొత్త రకం డెల్టా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు డెల్టా వేరియంట్ పాకింది. ఈ కారణంగా మళ్లీ కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని దేశాలను థర్డ్ వేవ్ సంకేతాలు భయపెడుతుంగా, మరికొన్ని దేశాలకు ఫోర్త్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. తాజాగా డెల్టా వేరియంట్ గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. డెల్టా వేరియంట్ తో గర్బిణులకు ఎక్కువ

10TV Telugu News

Pregnants Delta Risk : కరోనా కొత్త రకం డెల్టా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తూ ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు డెల్టా వేరియంట్ పాకింది. ఈ కారణంగా మళ్లీ కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని దేశాలను థర్డ్ వేవ్ సంకేతాలు భయపెడుతుంగా, మరికొన్ని దేశాలకు ఫోర్త్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. తాజాగా డెల్టా వేరియంట్ గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. డెల్టా వేరియంట్ తో గర్బిణులకు ఎక్కువ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. వెంటనే గర్బిణులు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆక్స్ ఫర్డ్ వర్సిటీ డేటా ప్రకారం.. డెల్టా వేరియట్ గర్బిణులపై అధిక ప్రభావం చూపుతోంది. వారు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారు. కరోనా బారిన పడ్డ గర్బిణుల్లో ఎక్కువమంది ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఆసుపత్రి పాలైన గర్బిణుల్లో చాలామంది అసలు వ్యాక్సిన్ తీసుకోని వారే ఎక్కువమంది ఉన్నారు. కాగా, వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా బారిన పడ్డ గర్బిణుల్లో.. చాలాతక్కువ మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు.

ఏది ఏమైనా, కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరే గర్బిణుల సంఖ్య పెరుగుతోందని, డెల్టా వేరియంట్ వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి కాబోతున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడం.. తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు చాలా అవసరమని చెబుతున్నారు. గర్భం దాల్చిన మహిళల్లో రోగనిరోధక శక్తిలో మార్పులు వస్తాయి. ఆ సమయంలో కరోనా బారిన పడితే తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం పెరుగుతుందని చెప్పారు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరి గర్బిణుల్లో 95శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారే అని డాక్టర్లు తెలిపారు.

గర్బం దాల్చిన మహిళలు కరోనా బారిన పడితే పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. లేదా ఇచ్చిన డేట్ కి ముందే ప్రసవం అవ్వొచ్చు. కాబట్టి గర్బిణులు వెంటనే టీకా తీసుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెల రోజులుగా కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరే గర్బిణుల సంఖ్య పెరుగుతోందన్నారు. గర్బధారణ కారణంగా రోగనిరోధక శక్తిలో గణనీయమైన మార్పులు వస్తాయి. అనేక వైరల్ ఇన్ ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం తల్లి, బిడ్డకు చాలా సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరే గర్భవతుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు డాక్టర్లు చెప్పారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గర్బిణులు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. వ్యాక్సిన్ విషయంలో గర్బవతులు భయపడాల్సిన పని లేదని, ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకా తీసుకోవాలని, వ్యాక్సిన్ చాలా సేఫ్ అని డాక్టర్లు తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే లాభాలను వివరించాలి. వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీబాడీలు తయారవుతాయి. పుట్టబోయే బిడ్డను కూడా అవి చేరతాయి. జబ్బు బారిన పడకుండా తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. జబ్బు నుంచి మిమ్మల్ని, మీకు పుట్టబోయే బిడ్డను కాపాడుకోవాలంటే టీకా మస్ట్ అని నిపుణులు స్పష్టం చేశారు.

డాక్టర్లు మరో ఆసక్తికర అంశం చెప్పారు. గత మే నెల నుంచి చూస్తే.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఒక్క గర్బిణి కూడా ఆసుపత్రిలో చేరలేదు. తొలి డోసు తీసుకున్న వారిలో ముగ్గురు మాత్రమే కరోనాతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. దీనిబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత సురక్షితమో అర్థమవుతుందన్నారు. వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడతాయి. కరోనా వ్యాక్సిన్ మిమ్మల్ని, మీ బిడ్డను, మీరు ప్రేమించే వారిని సురక్షితంగా కాపాడుతుంది.

ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా చూస్తుంది అని ఇంగ్లండ్ చీఫ్ హెల్ ఆఫీసర్ జాక్వెలిన్ బెంట్ అన్నారు. గర్బిణులు తమను, కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కచ్చితంగా టీకా తీసుకోవాలని జాక్వెలిన్ బెంట్ విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడిన చాలామంది ప్రెగ్నెంట్లు తీవ్రమైన అనారోగ్యంతో మా ఆసుపత్రిలో చేరుతున్నారు. వారిలో ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకోని వారే అని రాయల్ కాలేజ్ ఆఫ్ గైనకాలజిస్ట్ ప్రెసిడెంట్ మోరిస్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. మిమ్మల్నే కాదు మీకు పుట్టబోయే బిడ్డను కూడా టీకా కాపాడుతుంది. సమయానికి ముందే ప్రసవం అయ్యే పరిస్థితి రాదని ఆయన అన్నారు.

10TV Telugu News