Kangayam : తమిళనాడులో కంగాయం జాతి పశువులకు డిమాండ్ ఎందుకంటే..

తమిళనాడు ప్రాంతంలో అధికంగా ఈ జాతికి చెందిన పశువులు కనిపిస్తాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి.

Kangayam : తమిళనాడులో కంగాయం జాతి పశువులకు డిమాండ్ ఎందుకంటే..

Kangayam

Kangayam : తమిళనాడులో కంగాయం జాతి అవులకు మంచి గిరాకీ లభిస్తోంది. ఈఅవు పాలలో ఎక్కువ పోషక విలువలు ఉండటంతో ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. కరోనా నేపధ్యంలో పాలతోపాటు, పాల ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరగటంతో కంగాయం జాతి అవులకు మంచి గిరాకీ ఏర్పడింది. పశుపోషకులు ఈ జాతి ఆవులను కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

తిరుప్పూర్‌ జిల్లా కంగేయం సమీపంలోని నత్తకుడియూర్‌-పాతకోట ప్రాంగణంలో రెండు నెలల అనంతరం నిర్వహించిన పశువుల సంతలో కంగాయం జాతి పాడి పశువులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. తిరుప్పూర్‌, కరూర్‌ సహా పలు జిల్లాలకు చెందిన రైతులు తాము పోషించుకుంటున్న పాడిపశువులు, లేగదూడలను ఈ సంతకు తరలించారు. ప్రత్యేకంగా తరలించిన 90 కంగాయం పశువులు, ఎద్దులలో 40 పాడి పశువులను రూ.16 లక్షలకు విక్రయించారు. లేగదూడతో ఉన్న కంగాయం పాడిపశువును ఓ వ్యాపారి రూ.75 వేలకు కొనుగోలు చేశాడు.

తమిళనాడు ప్రాంతంలో అధికంగా ఈ జాతికి చెందిన పశువులు కనిపిస్తాయి. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఈ జాతికి మూలం తమిళనాడులోని కంగేయం ప్రాంతం. అందుకే దీనికి కంగాయంగా పేరు వచ్చింది. మధ్యస్ధపరిమాణంలో ఉండే కంగాయం పశువులు ములానూర్, తిరుప్పూర్, కరూర్ ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. పెద్ద పరిమాణంలో ఉండే కంగాయం పశువులు దిండికల్ , కరూర్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి.

తమిళనాడు నుండి బ్రెజిల్ దేశానికి కంగాయం జాతి అవులు ఎగుమతి చేయబడ్డాయి. అక్కడ వీటిని కంగాయన్ గా పిలుస్తారు. గరిష్టంగా రోజుకు 4 నుండి 5 లీటర్ల పాలు ఇస్తాయి. కంగాయం జాతి ఎద్దులను తమిళనాడు సంప్రదాయ క్రీడైన జల్లికట్టులో ఎక్కవగా ఉపయోగిస్తారు.