Dengue In Delhi : ఢిల్లీపై డెంగ్యూ పంజా..23మరణాలు,9500 కేసులు

దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో ఢిల్లీలో డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజా నివేదిక ప్రకారం

Dengue In Delhi : ఢిల్లీపై డెంగ్యూ పంజా..23మరణాలు,9500 కేసులు

Dengue

Dengue In Delhi : దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో ఢిల్లీలో డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజా నివేదిక ప్రకారం…ఢిల్లీలో డిసెంబరు 18 వరకు డెంగీ కారణంగా మరణించినవారి సంఖ్య 17గా ఉండగా, డిసెంబరు 25 నాటికి ఈ సంఖ్య 23కు పెరిగింది. అయితే గత ఐదేళ్లతో పోలిస్తే అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదిలోనే నమోదు కావడం గమనార్హం.

2016 తర్వాత ఢిల్లీలో అత్యధిక డెంగీ మరణాలు ఈ ఏడాదే నమోదయ్యాయి. 2016లో ఢిల్లీలో 10 డెంగ్యూ మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది ఢిల్లీలో నమోదైన 23 డెంగ్యూ మరణాల్లో.. గత రెండు నెలల వ్యవధిలోనే ఓ ఎనిమిది నెలల శిశువు సహా ఆరుగురు మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు,దిల్లీలో ఈ ఒక్క నెలలో..25వ తేదీ వరకు 1,269 డెంగీ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికల్లా ఢిల్లీలో నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య 9,545కు చేరిందని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా, 2016లో ఢిల్లీలో 4,431 డెంగ్యూ కేసులు,2017లో 4,726 కేసులు,2018లో 2,798 కేసులు,2019లో 2,036 కేసులు,2020లో 1072 డెంగ్యూ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.

ALSO READ MoC Accounts : మదర్ థెరిసా మిషనరీల అకౌంట్లు ఫ్రీజ్..మమత ఆరోపణలకు కేంద్రం కౌంటర్