Coffee : చక్కని ఆరోగ్యానికి చిక్కని కాఫీ

కాఫీ తాగటం వల్ల మరో ప్రయోజనం కూడా పొందవచ్చు. రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగటం వల్ల శరీర కదలికలు చురుకుగా ఉంటాయి.

Coffee : చక్కని ఆరోగ్యానికి చిక్కని కాఫీ

Processed With Vsco With A9 Preset

Coffee : ఉదయాన్నే వేడి వేడి కాఫీ కొద్ది కొద్దిగా గొంతులోకి దిగుతుంటే ఎంతో సుఖంగా, హాయిగా అనిపిస్తుంది. ఎక్కడలేని ఉత్సాహం తన్నుకు వచ్చేస్తుంది. రోజు వారీ కార్యక్రమాలు అన్నీ చకచకా ఒకదాని వెంట మరొకటి జరిగి పోతాయి. మొత్తానికి కప్పు కాఫీతో రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే కాకుండా రోజు మొత్తం మీద కూడా చాలా సార్లు కాఫీ తాగుతుంటారు చాలా మంది. అలా కాఫీని రోజు మొత్తం మీద తరచూ తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు దాగి వున్నాయని పరిశోధకులు అంటున్నారు. కొన్ని రకాల వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి కాఫీకి వుందని వారు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జనాభాను వణికిస్తున్న ఆరోగ్య సమన్యలలో డయాబెటిక్‌ వ్యాధి ఒకటి, ఇది జాగ్రత్తపడడం కంటే రాకుండా తగిన చర్యలు. తీసుకోవడం మంచిదన్నది చాలా మంది అభిప్రాయం. ముందు జాగ్రత్తల్లో భాగంగా రోజుకు ఐదు కప్పుల కాఫీ తాగితే డయాబెటిస్ రాదని యూరప్ లో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. కాఫీలోని కెఫైన్‌ డయాబెటిస్‌ వచ్చే అవకాశాన్ని 30శాతం వరకు తగ్గిస్తుందని తేల్చారు.

కప్పు కాఫీతో రోజును ప్రారంభిస్తే రోజంతా చురుకుగా , ఉత్సాహంగా ఉండవచ్చని నెదర్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. రహదారుల్లో ప్రయాణించే డ్రైవర్లకు కాఫీ తగినంత శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. కప్పు కాఫీ మూడు నుండి నాలుగు గంటలపాటు మనిషిలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని వారు తెలిపారు. కాఫీలో మూడును సరిచేసే గుణంతో పాటు జ్ణాపక శక్తిని పెంచే సుగుణాలు ఉన్నాయని తేల్చారు.

కాఫీ తాగటం వల్ల మరో ప్రయోజనం కూడా పొందవచ్చు. రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగటం వల్ల శరీర కదలికలు చురుకుగా ఉంటాయి. దీంతో పాటు వ్యాయమం కూడా ఉత్సాహంగా చేయవచ్చు. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు క్రమేపి కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ సక్రమంగా సాగటానికి కాఫీ సహకరిస్తుందని అంటున్నారు.

వృద్దుల్లో చాలా మంది అల్జీమర్, పార్కిన్స్ వంటి ఆరోగ్యసమస్యలతో సతమతమౌతున్నారు. ఈ రెండు సమస్యలతో మృత్యువాత పడే వృద్దుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనిపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమౌతుంది. ఈనేపధ్యంలో వృద్ధుల్లో కాఫీ తాగే అలవాటు పెంచగలిగితే అల్జీమర్స్, పార్కిన్స్ వంటి సమస్యలను తగ్గించవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ వ్యాధులు వచ్చే అవకాశాలను కాఫీ అడ్డుకుంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. మారిన జీవనప్రమాణాలు, ఆహారపు అలవాట్లు కారణంగా కాలేయం దెబ్బతింటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా మద్యం సేవించే వారిలో కాలేయ సమస్యలు అధికంగా ఉంటాయి. అయితే కాఫీ తాగే అలవాటు ఉంటే మాత్రం కాలేయ సంబంధ వ్యాధులను 70శాతం వరకు నివారించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ ద్వారా విటమిన్ బి5, విటమిన్ బి2, , బి1, బి3 , పోటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు, యాంటి ఆక్సిడెంట్లు మన శరీరానికి లభిస్తాయి.