Supreme Court : అత్త అల్లుడు ఇంట్లో ఉంటే బీమా పరిహారం చెల్లింపు ఎలా తగ్గిస్తారు? వడ్డీతో సహా చెల్లించాల్సిందే : సుప్రీం

అత్త అల్లుడు ఇంట్లో ఉంటే బీమా పరిహారం చెల్లింపు ఎలా తగ్గిస్తారు? అంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.

Supreme Court : అత్త అల్లుడు ఇంట్లో ఉంటే బీమా పరిహారం చెల్లింపు ఎలా తగ్గిస్తారు? వడ్డీతో సహా చెల్లించాల్సిందే : సుప్రీం

Supreme Court Key Judgment

Supreme Court key judgment  : ఓ మహిళ యాక్సిడెంట్ లో భర్తను కోల్పోయాక ఆమె కొడుకు ఇంట్లో తప్ప మరెక్కడా ఉండకూడదా? ముఖ్యంగా తనను ఆదరించిన అల్లుడి దగ్గర ఉండకూడదా? అలా ఉంటే ఆమెకు న్యాయంగా రావాల్సిన బీమా నష్ట పరిహారం రాదా? ఇది సమాజానికి సంబంధించిన న్యాయమా? లేదా చట్టబద్దమా? అనే ప్రశ్నలకు దేశ అత్యున్నత ధర్మాసం అయిన సుప్రంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పునే కొట్టిపారే సంచలన తీర్పునిచ్చింది. సదరు బాధితురాలు ఎక్కడ ఉన్నా..ఆమె అల్లుడి దగ్గర ఉన్నా ఆమె భర్తను కోల్పోయింది కాబట్టి ఇవ్వాల్సిన నష్టపరిహారం వడ్డీతో సహా ఇవ్వాల్సిందేనంటూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సదరు బీమా సంస్థకు దిమ్మతిరిగిపోయింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి బీమా చెల్లించే కేసు విచారణలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఆమె కూడా అర్హురాలే అవుతుందని తేల్చి చెప్పింది.

Read more : Sexual Harassment :‘స్కిన్‌ టు స్కిన్‌’జరిగితేనే లైంగిక వేధింపులు..లేకుంటే కాదు అనటం చాలా దారుణం : సుప్రీంకోర్టు

కేసు వివరాల్లోకి వెళితే..కేరళకు చెందిన ఎన్ వేణుగోపాలన్ నాయర్ అనే 52 Mathematics ప్రొఫెసర్ 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని..కాబట్టి రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more : సుప్రీం సంచలన తీర్పు : భ‌ర్త‌ను ఆ సందర్భంలో చంపితే హత్యకాదు

అల్లుడి ఇంట్లో అత్త నివసిస్తున్నంత మాత్రాన ఆయనకు ఆమె చట్టబద్ధ ప్రతినిధి కాకుండా పోదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఆమె కూడా అర్హురాలేనని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మృతుడి భార్య కుమార్తె, అల్లుడు వద్ద నివసించడం భారత సమాజంలో కొత్తేమీ కాదనీ..ఇది అసాధారణ విషయమేమీ కాదని, వృద్ధాప్యంలో పోషణ కోసం అల్లుడిపైనా ఆధారపడుతుంటారని వ్యాఖ్యానించింది.

Read more : Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

భర్త మరణించినప్పుడు ఆమె ఆర్థికంగాను..మానసికంగా ఇబ్బందులు పడుతుందని..అటువంటి సమయంలో కూతురు,అల్లుడు వారికి అండగా ఉంటు వారి ఇంట్లో ఉంచుకోవటం తప్పేంటీ అంటూ ప్రశ్నించింది. కాబట్టి పరిహారం పొందేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం అల్లుడికి ఆమె చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు పైన పేర్కొన్న మొత్తానికి 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో సదరు బీమా సంస్థ ఆమెకు నష్టపరిహారం ఇవ్వక తప్పనిపరిస్థితి అయ్యింది.

Read more : Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు