Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!

శరీర వ్యవస్ధ, న్యూరో ట్రాన్స్ మీటర్ల వ్యవస్ధ మొత్తం మనం రోజు వారిగా తీసుకునే విటమిన్ల పైనే ఎక్కువ అధారపడి ఉంటుంది. విటమిన్ బి6, ఫోలేట్, వంటివి కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివాటిలో లభిస్తాయి.

Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!

Girl Watching View

Depression : ఆలోచనలు, భావోద్వేగాలు మనస్సుపై తీవ్రప్రభాన్ని చూపిస్తాయి. మనస్సు ధృఢంగా ఉంటే డిప్రెషన్ వంటి సమస్యలు దరిచేరవు. ఒక వేళ డిప్రెషన్ కు లోనైనా ఎంతో కాలం నిలువలేవు. అయితే శరీరం ధృఢంగా ఉంచుకోగలిగితే మనస్సు సైతం ధృడంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మనం తీసుకునే ఆహారం ఎంతగానో దోహదపడుతుంది. ఆహారంలో ఉండే ఫాట్స్ , ఆలివ్ నూనె లాంటి మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ హార్మోను ఉత్పత్తి చేయటంలో కీలక పాత్రను పోషిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

నాడి కణాలను, మెదడులోని రిసెప్టార్ల మధ్య బంధాన్ని కుదుర్చటంలో సెరటోనిన్ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. ఆకలిని క్రమద్దం చేయటంలో సహాయపడుతుంది. సెరటోనిన్ హార్మోన్ కొన్ని సందర్భాల్లో మెలటోనిక్ గా మారి మంచి నిద్రకు ఉపకరిస్తుంది. యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మనం తీసుకునే కొవ్వు పదార్ధాల నాణ్యత కచ్చితంగా నరాల పొరను ధృడపరుస్తుంది.

శరీర వ్యవస్ధ, న్యూరో ట్రాన్స్ మీటర్ల వ్యవస్ధ మొత్తం మనం రోజు వారిగా తీసుకునే విటమిన్ల పైనే ఎక్కువ అధారపడి ఉంటుంది. విటమిన్ బి6, ఫోలేట్, వంటివి కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివాటిలో లభిస్తాయి. ఇవి ఆరోగ్య వంతమైన సెరటోనిన్ ను పెంచేందుకు సహాయపడతాయి. బివిటమిన్, ఫోలిక్ యాసిడ్ డ్రిప్రెషన్ కు విరుగుడుగా జీవక్రియల్ని ఉత్తేజితం చేయటంలో తోడ్పడతాయి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం వల్ల రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది. గుండెజబ్బులు దరిచేరవు. డిప్రెషన్ కు తావుండదు.