Dera Baba: జైలు నుంచి విడుదల కానున్న డేరా బాబా.. నెల రోజుల పెరోల్

డేరా సచ్చా సౌదా ఆశ్రమం నిర్వహిస్తున్న డేరా బాబా.. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో 2017 నుంచి హరియాణాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

Dera Baba: జైలు నుంచి విడుదల కానున్న డేరా బాబా.. నెల రోజుల పెరోల్

Dera Baba

Dera Baba: డేరా బాబాగా గుర్తింపు పొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా పెరోల్ లభించింది. డేరా సచ్చా సౌదా ఆశ్రమం నిర్వహిస్తున్న డేరా బాబా.. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో 2017 నుంచి హరియాణాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రేప్ కేసుతోపాటు ఆయనపై హత్య కేసులు కూడా నమోదయ్యాయి.

Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు

డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా ఆయనకు శిక్ష విధించింది కోర్టు. పదహారేళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేయడంతోపాటు మరికొందరిని కూడా హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో పలు కేసుల్లో డేరా బాబా ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పట్నుంచి జైల్లోనే ఉంటున్న డేరా బాబా అప్పుడప్పుడు పెరోల్‌పై బయటకు వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆయన పెరోల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. అప్పుడు దాదాపు రెండు వారాలు బయటే ఉన్నాడు. అయితే, ఆ సమయంలో కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరినీ కలవకూడదని కోర్టు సూచించింది. అలాగే తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో, ఆమెకు సేవ చేసేందుకు కూడా డేరా బాబాకు పలు సార్లు పెరోల్ లభించింది.

Two Died: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు మృతి

తాజాగా మరోసారి నెల రోజుల పెరోల్ లభించింది. ఈ సారి ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని బర్నావాలో ఉన్న తన ఆశ్రమమైన డేరా సచ్చా సౌదాకు వెళ్తారు. అక్కడే నెల రోజులపాటు ఉంటారు. ఈ సందర్భంగా ఆయనకు జడ్ కేటగిరి భద్రత ఉంటుంది. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తుల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పిస్తోంది. శుక్రవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని జైలు అధికారులు తెలిపారు.