Corona Death: రూ.52 లక్షలు చెల్లించినా.. చివరికి మృతదేహం ఇచ్చారు!

కరోనా రోగి డాక్టర్.. ఆమె భర్త కూడా డాక్టరే. కరోనా సోకడంతో ఓ ఆసుపత్రిలో చేరగా కోవిడ్ నుండి కోరుకున్నా.. తర్వాత తలెత్తిన ఇతర ఆరోగ్య సమస్యల వైద్యం కోసం ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే రూ.52 లక్షల బిల్లేశారు.

Corona Death: రూ.52 లక్షలు చెల్లించినా.. చివరికి మృతదేహం ఇచ్చారు!

Corona Death

Corona Death: కరోనా రోగి డాక్టర్.. ఆమె భర్త కూడా డాక్టరే. కరోనా సోకడంతో ఓ ఆసుపత్రిలో చేరగా కోవిడ్ నుండి కోరుకున్నా.. తర్వాత తలెత్తిన ఇతర ఆరోగ్య సమస్యల వైద్యం కోసం ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే రూ.52 లక్షల బిల్లేశారు. హాస్పటిల్ అడిగినంత చెల్లించినా చివరికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే తన భార్య చనిపోయిందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్‌ శివారు కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ భావన(31)కు 15 నెలల కిందట అదే ప్రాంతనికి చెందిన డాక్టర్‌ కల్యాణ్‌తో వివాహమైంది. వివాహానికి ముందు బేగంపేట సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో రేడియాలజిస్టుగా పనిచేస్తున్న ఆమె వివాహం తరువాత వృత్తికి దూరంగా ఉన్నారు. కాగా.. ఏప్రిల్ లో ఆమె కరోనా బారినపడటంతో ఏప్రిల్‌ 22 నుండి మే 6 వరకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుండి కోలుకున్నారు. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తి ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారు.

గత 26 రోజులుగా ఆమె ఎక్మో మీద చికిత్స పొందుతుండగా ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో వారం రోజులలో ఆమెని డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు చెప్పారని ఆమె భర్త చెప్తున్నారు. అయితే.. గురువారం ఆమె మరణించారు. దీనికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఎక్మో పైపు సరిగా లేకపోవడంతో అర్ధరాత్రి రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయినా ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్‌ స్థాయి 94గా ఉండగా పైపు డ్యామేజ్ కారణంగా 64కు పడిపోయిందని.. ఆ తర్వాత ఫ్లూయిడ్‌ ఓవర్‌లోడ్‌ చేయడంతో గురువారం వేకువజామున ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని ఆమె భర్త చెప్తున్నారు. ఆసుపత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించామని అయినా ఆసుపత్రి నిర్లక్ష్యమే నా భర్త చంపేసిందని భర్త కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఎక్మోకు అమర్చిన పైకి మార్చి ఉంటే నా భార్య మరో వారం రోజులలో డిశార్జ్ అయ్యేదని ఆయన విలపిస్తున్నారు.