D 43 – ధనుష్, మాళవికా మోహనన్..

D 43 – ధనుష్, మాళవికా మోహనన్..

D 43: తమిళస్టార్ ధనుష్, మాళవికా మోహనన్ జంటగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది.

D 43

‘16’ చిత్రంతో ఆకట్టుకున్న కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన ‘మాఫియా.. చాప్టర్ 1’, నరకాసురుడు’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా ధనుష్ తో సినిమా స్టార్ట్ చేసేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు.

లొకేషన్‌లో ధనుష్, మాళవికా ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ధనుష్ నటించిన ‘జగమేతంత్రం’ త్వరలో విడుదల కానుంది.

D 43