Dharmesh Shah : వామ్మో.. డొమైన్ నేమ్‌ రూ.82 కోట్లకు కొన్నాడట

ఒక పేరు కోసం రూ.82 కోట్లా? అవును .. డొమైన్ నేమ్ కోసం అక్షరాల అంతే మొత్తం చెల్లించాడు ఓ వ్యక్తి. తిరిగి దానిని లాభాలకు విక్రయించి .. వచ్చిన లాభాలు విరాళాలు పంచాడు. ఎవరో తెలుసుకోవాలని ఉందా?

Dharmesh Shah : వామ్మో.. డొమైన్ నేమ్‌ రూ.82 కోట్లకు కొన్నాడట

Dharmesh Shah

Millionaire Dharmesh Shah : కేవలం ఒక పేరు కోసం రూ.82 కోట్లు చెల్లించాడా? ఆశ్చర్యపోతున్నారా? ఆ వ్యక్తి రూ.8,200 కోట్ల పైగా ఆస్తి ఉన్న ధర్మేష్ షా.. అతని గురించి తెలుసుకోవాలని ఉంది కదా..

Mahima Datla : ఆస్తి రూ.8700 కోట్లు..! ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనిక మహిళ.. ఎవరీ మహిమా దాట్ల..?

ధర్మేష్ షా కోటీశ్వరుడు. 2006 లో హబ్ స్పాట్‌ను స్ధాపించిన ఇండో-అమెరికన్ వ్యవస్థాపకుడు. HubSpot అనేది డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ , కస్టమర్ సర్వీస్‌లను నిర్వహించడంలో ఇతర సంస్థలకు సహాయపడే సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ కంపెనీలో షా 441 ​​మిలియన్ డాలర్ల విలువైన 1.4 శాతం వాటాను కలిగి ఉన్నారు.

 

90 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్న OnStartups.com అనే బ్లాగ్‌ను కూడా ఆయన రాస్తారు. అయితే రీసెంట్‌గా ఒక డొమైన్ నేమ్ కోసం రూ. 82 కోట్లు చెల్లించి వార్తల్లోకెక్కారు. అంతేనా? తరువాత దానిని లాభాలకు అమ్మేసి వచ్చిన లాభంలో రూ. 2 కోట్లు విరాళాలు ఇచ్చేసారట. ఇంతకీ అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన డొమైన్ పేరు Chat.com.

ఈ ఖడ్గం ధర రూ.143 కోట్లు.. ఎందుకంత రేటు అంటే..

షా ఇండియాలోని అంకలేశ్వర్‌లో జన్మించారు. అతని కుటుంబం యునైటెడ్ స్టేట్స్ ఆ తరువాత కెనడాలో స్థిరపడింది. షా ఒకసారి తన అమ్మమ్మను చూసుకోవడానికి ఇండియా వచ్చారట. అప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో అడ్మిషన్ తీసుకున్నా తన ఫ్యామిలీతో కలిసి యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్లాల్సి వచ్చిందట. అలబామా విశ్వవిద్యాలయం నుండి BS, కంప్యూటర్ సైన్స్ చేసారు. ఆ తరువాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2006లో హబ్‌స్పాట్‌ను ప్రారంభించి బ్లాగింగ్ మరియు మార్కెటింగ్ ఈవెంట్‌ల ద్వారా మార్కెటింగ్‌పై దృష్టి పెట్టారు ధర్మేష్ షా.