MS Dhoni : ‘ఎనీ టిప్ సార్?’.. ట్రోల్‌కి ధోనీ ధీటైన జవాబు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నైనా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఎవరూ మర్చిపోరు. కానీ 5G యుగంలోనూ భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ ఫోన్‌కి దూరంగా ఉండటం గొప్ప విషయం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కొద్ది సమయంలో మాత్రం తనపై ఎవరైనా ట్రోల్ చేస్తే తగిన సమాధానం చెప్పేవాడు. గతంలో ఓ అభిమాని చేసిన ట్వీట్‌కి ధోనీ ఇచ్చిన సమాధానం తాజాగా వైరల్ అవుతోంది.

MS Dhoni : ‘ఎనీ టిప్ సార్?’.. ట్రోల్‌కి ధోనీ ధీటైన జవాబు

MS Dhoni

Dhoni reply to the fan : క్రికెట్ దిగ్గజం MS ధోని ఎంత కూల్ పర్సన్ అందరికీ తెలిసిందే. 5 జీ యుగంలో కూడా ఫోన్‌కి దూరంగా ఉండే వ్యక్తి. ఈ లెజెండరీ క్రికెటర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కొద్ది సమయంలో ట్రోల్ చేసే ఫ్యాన్స్‌కి మాత్రం ధీటైన జవాబు ఇచ్చేవాడు. 2012 లో ఓ అభిమాని ట్వీట్‌కి ధోనీ ఇచ్చిన సమాధానం తాజాగా వైరల్ అవుతోంది.

MS Dhoni – Jadeja: మహేంద్ర సింగ్‌ ధోనీని ఉద్దేశిస్తూ జడేజా ఆసక్తికర ట్వీట్.. ఫ్యాన్స్ ఖుషీ

ధోనీ మామూలు సమయాల్లోనే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండడు. ఇకపై కూడా ధోనీ ఇదే పంథాలో ఉన్నా ఆశ్చర్యం లేదు. అతని 41 ఏళ్ల జీవితం ఓ పాఠశాలగా అభివర్ణించవచ్చును. జనం అంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్న సమయంలో ధోనీ మాత్రం ఫోన్‌కి దూరంగా ఉంటాడు. కానీ తను యాక్టివ్‌గా ఉన్న అతి కొద్ది సమయంలో ఎవరైనా ట్రోల్ చేస్తే మాత్రం ధీటైన జవాబు ఇచ్చేవాడు. అలాంటి సంఘటన 2012 లో జరిగింది. శ్రీధర్ రెడ్డి Sridhar Reddy Vakiti అనే అభిమాని ధోనిని బ్యాటింగ్ మీద దృష్టి పెట్టమంటూ సలహా ఇచ్చాడు. ‘ప్లీజ్ ట్విట్టర్‌లో కాకుండా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టండి’ అంటూ ట్వీట్ చేశాడు.

 

 

ఈ ట్వీట్ చూసిన ధోని ‘సార్ అవును సార్.. ఏమైనా చిట్కాలు సార్’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ధోని అభిమానులు శ్రీధర్ రెడ్డి ట్వీట్‌పై విరుచుకుపడ్డారు. ‘శ్రీధర్ రెడ్డి నీకు ఏం పని లేదా ? ధోనికే సలహా ఇచ్చేంతవాడివా? ‘అంటూ ఫైర్ అయ్యారు. ట్వీట్ పాతదే అయినా మళ్లీ కొత్తగా వైరల్ అవుతోంది.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారా? సీఎస్‌కే విజయం తరువాత ఏం చెప్పారంటే

ధోనీ ఫోన్ పెద్దగా వాడకపోవడం వల్ల చాలామంది అతనితో సన్నిహితంగా ఉండటం కష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు.వారిలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ధోనీ ఫోన్ తన వెంట తీసుకెళ్లకపోవడం వల్ల అతనితో క్లోజ్ గా ఉండటం కష్టమని గతంలో ఒకసారి చెప్పాడు.