Forbes Data: భారత్‌లో 100 మంది ధనవంతులకు 2022 బాగా కలిసొచ్చిందా?.. ఫోర్బ్స్ నివేదిక ఏం చెప్పిందంటే?

ఫోర్బ్స్-2022 జాబితా ప్రకారం.. దేశంలో వందమంది అగ్రశ్రేణి వ్యాపారుల సంపద 52 బిలియన్ల డాలర్లు పెరిగి 800 బిలియన్ల డాలర్లు దాటింది. కొవిడ్ మహమ్మారి తరువాత భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే దేశంలోని టాప్ 10 సంపన్నుల విలువ 385 బిలియన్ డాలర్లు.

Forbes Data: భారత్‌లో 100 మంది ధనవంతులకు 2022 బాగా కలిసొచ్చిందా?.. ఫోర్బ్స్ నివేదిక ఏం చెప్పిందంటే?

Gowtham Adhani

Forbes Data: భారతదేశంలో టాప్ 10 ధనవంతుల ఆస్తులు ఎంతో తెలుసా? ఈ ఏడాది వీరి సంపద ఎంత పెరిగిందో తెలుసా? 2023 ప్రపంచంలోని చాలా మందికి మాంద్యంలా కనిపించొచ్చు.. కానీ అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం.. భారతదేశంలోని సంపన్నులకు 2022 సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ఫోర్బ్స్ 2022 జాబితా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనల మధ్య రూపాయి క్షీణత వ్యాపార వర్గాలను ఆందోళణకు గురిచేసింది. అయితే, ఈ ప్రభావం కేవలం కొంతమంది వ్యాపారులపైనే పడింది. దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల వాటా ఈ ఏడాది దాదాపు 30శాతం పెరిగినట్లు అంచనా.

ఫోర్బ్స్ టాప్ 10 భారత కుబేరుల్లో నాల్గో స్థానంలో DMart అధినేత దమానీ

ఫోర్బ్స్-2022 జాబితా ప్రకారం.. దేశంలో వందమంది అగ్రశ్రేణి వ్యాపారుల సంపద 52 బిలియన్ల డాలర్లు పెరిగి 800 బిలియన్ల డాలర్లు దాటింది. కొవిడ్ మహమ్మారి తరువాత భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే దేశంలోని టాప్ 10 సంపన్నుల విలువ 385 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదానీ 2021లో తన వ్యాపారాన్ని మూడు రెట్లు పెంచుకున్నాడు. ఈ క్రమంలో దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా చోటు దక్కించుకున్నాడు. నివేదిక ప్రకారం.. 2022లో 150 బిలియన్ల డాలర్లకు ఆదాయం పెరిగింది. మరోవైపు భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో రెండవది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ. అతని నికర విలువ ప్రస్తుతం 88 బిలియన్ డాలర్లు వద్ద ఉంది. గత సంవత్సరం నుండి 5శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.

అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో ఆ ముగ్గురు.. వీరి సంపాదన ఎంతంటే?

డిమార్ట్ చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్‌ల యజమాని రాధాకిషన్ దామ్లానీ జాబితాలో మూడవ స్థానంలో ఉండగా, అతని తర్వాత సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా ఉన్నారు. డామ్లానీ నికర విలువ 27.6 బిలియన్ల డాలర్లు, పూనావల్ల 21.5 బిలియన్ల డాలర్లు. ఫోర్బ్స్ ప్రకారం నివేదిక ప్రకారం.. సావిత్రి జిందాల్ – OP జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ 16.4 బిలియన్ల డాలర్లతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళ. ఆమె ఏకైక మహిళా బిలియనీర్ కూడా. మహీంద్రా మరియు మహీంద్రా యొక్క ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించిన తర్వాత ఆనంద్ మహీంద్రా జాబితాకు తిరిగి వచ్చినట్లు నివేదికలో చెప్పబడింది.