Dil Raju : నేను సంక్రాంతికి వస్తానని ముందే చెప్పా.. చిరంజీవి, బాలకృష్ణే తర్వాత చెప్పారు..

ఇటీవల తెలుగు నిర్మాతల మండలి పండగల సమయంలో తెలుగు సినిమాలకే ముందు థియేటర్స్ కేటాయించాలని, ఆ తర్వాతే డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇవ్వాలని నోటిస్ రిలీజ్ చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఇండైరెక్ట్ గా దిల్ రాజుకి.................

Dil Raju : నేను సంక్రాంతికి వస్తానని ముందే చెప్పా.. చిరంజీవి, బాలకృష్ణే తర్వాత చెప్పారు..

Dil Raju comments on sankranthi movies

Dil Raju :  టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ అంతా షూటింగ్స్ ఆపిన సమయంలో దిల్ రాజు తనది తమిళ్ సినిమా అని విజయ్ వరిసు షూటింగ్ ఆపలేదు. అయితే ఈ సినిమాని ముందు తెలుగు సినిమాగా అనౌన్స్ చేయడం విశేషం. ఇక గతంలో దిల్ రాజే పండగలకి డబ్బింగ్ సినిమాలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వకూడదు అని చెప్పారు.

ఇటీవల తెలుగు నిర్మాతల మండలి పండగల సమయంలో తెలుగు సినిమాలకే ముందు థియేటర్స్ కేటాయించాలని, ఆ తర్వాతే డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ఇవ్వాలని నోటిస్ రిలీజ్ చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఇండైరెక్ట్ గా దిల్ రాజుకి కౌంటర్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. ఈ వివాదం తమిళ సినీ పరిశ్రమకి కూడా పాకింది.

Tiruveer : హీరో అంటే నాకు ఇష్టం ఉండదు.. అలాంటి పాత్రలే వస్తుంటే బాధేసింది..

దీనిపై తాజగా దిల్ రాజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. ”నేను విజయ్ తో సినిమాని అనౌన్స్ చేసినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేస్తాను అని చెప్పాను. బాలకృష్ణ సినిమా దసరాకి వస్తుందన్నారు. కానీ ఇంకా షూటింగ్ అవ్వకపోవడంతో సంక్రాంతికి పెట్టుకున్నారు. ఇక చిరంజీవి సినిమా సంక్రాంతికి వస్తుందని ఇటీవలే చెప్పారు. అప్పుడు తప్పు నాది ఎలా అవుతుంది. గతంలో పేట సినిమా కావాలని సంక్రాంతికి వచ్చింది అందుకే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. కానీ నేను ఇది సంక్రాంతికి రిలీజ్ చేస్తానని ఎప్పుడో చెప్పేశాను. అయినా తెలుగు పరిశ్రమలో ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు రావడం ఇదే మొదటి సారి. వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలు రెండూ మైత్రి వాళ్ళవే. ఒక సంస్థ తమ రెండు సినిమాలని ఒకేసారి ఎలా రిలీజ్ చేస్తుంది. మైత్రి వాళ్లకి లేని బాధ బయటి వాళ్లకి ఎందుకు” అంటూ సీరియస్ అయ్యారు. దీంతో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చకి దారిగా తీశాయి.