Heroines : మళ్లీ వీళ్లే కావాలంటున్నారు.. డైరెక్టర్ – హీరోయిన్ క్రేజీ కాంబినేషన్స్..

హీరో - హీరోయిన్ కాంబినేషన్ మాత్రమే కాదు.. డైరెక్టర్ - హీరోయిన్ కాంబోకి కూడా క్రేజ్ ఉంది టాలీవుడ్‌లో. ఓ యాక్ట్రెస్‌తో రాపో సెట్టయితే మళ్లీ మళ్లీ ఆ భామే కావాలంటున్నారు మేకర్స్..

Heroines : మళ్లీ వీళ్లే కావాలంటున్నారు.. డైరెక్టర్ – హీరోయిన్ క్రేజీ కాంబినేషన్స్..

Heroines

Heroines: హీరో – హీరోయిన్ కాంబినేషన్ మాత్రమే కాదు.. డైరెక్టర్ – హీరోయిన్ కాంబోకి కూడా క్రేజ్ ఉంది టాలీవుడ్‌లో. ఓ యాక్ట్రెస్‌తో రాపో సెట్టయితే మళ్లీ మళ్లీ ఆ భామే కావాలంటున్నారు మేకర్స్. హీరోయిన్స్ సైతం సక్సెస్ ఇచ్చిన దర్శకుడికి ఎన్నిసార్లైనా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పుడలా ఫిక్సవుతోన్న గ్లామర్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం..

రష్మికా మందన్నా.. సౌత్ టు నార్త్ మోస్ట్ వాంటెడ్ గర్ల్. ఈ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్స్. కానీ రష్మికా తనకు ఎంట్రీతోనే హిట్ ఇచ్చిన దర్శకుడితో పనిచేసేందుకు ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది.. వెంకీ కుడుముల – వరుణ్ తేజ్ కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. దసరాకు ప్రారంభంకాబోయే ఈ ప్రాజెక్ట్‌లో రష్మికానే హీరోయిన్‌గా ఫైనల్ చేశారట వెంకీ. ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాల తర్వాత మరోసారి వెంకీ కుడుముల ఫిల్మ్‌లో మెరవనుంది రష్మికా.

Rashmika Mandanna

పూజా హెగ్డే – త్రివిక్రమ్.. ఈ కాంబో కూడా సూపర్ హిట్. త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలతో హిట్స్ అందుకుందీ గ్లామర్ క్వీన్. తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోయే మహేష్ బాబు ప్రాజెక్ట్‌లోనూ పూజా పాపే హీరోయిన్ అంటున్నారు. గతంలో కూడా తనకు కలిసొచ్చిన హీరోయిన్స్‌ను రిపీట్ చేశారు త్రివిక్రమ్. ఇలియానా (జల్సా – జులాయి). సమంత (అత్తారింటికి దారేది – సన్నాఫ్ సత్యమూర్తి – అ..ఆ..) త్రివిక్రమ్ సినిమాల్లో అలా ఆడిపాడినవాళ్లే.

Pooja Hegde

కియారాతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు డైరెక్టర్ కొరటాల శివ. ‘భరత్ అనే నేను’ తర్వాత ‘ఆచార్య’ లోనూ నిజానికి కియారా నటించాల్సింది. కానీ బాలీవుడ్‌లో బిజీగా ఉండి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ‘ఆచార్య’ లో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే మాత్రం నెక్ట్స్ మిస్ అవకుండా కియారాను ఫిక్స్ చేస్తున్నారు కొరటాల. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో కియారానే ఫైనల్ అయిందని టాక్.

Kiara Advani