ఓ మనిషిని చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు.. పీవీపీ ట్వీట్ పై హరీశ్ శంకర్

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌ ట్యాలెంట్‌ను

  • Published By: naveen ,Published On : May 18, 2020 / 07:59 AM IST
ఓ మనిషిని చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు.. పీవీపీ ట్వీట్ పై హరీశ్ శంకర్

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌ ట్యాలెంట్‌ను

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య జరుగుతున్న వివాదంలోకి మరో ప్రముఖ నిర్మాత పీవీపీ ఎంటర్ అయ్యారు. బండ్ల గణేష్ పై ఫైర్ అయిన పీవీపీ దర్శకుడు హరీష్ కి సపోర్ట్ పలికారు. హరీష్ కి అనుకూలంగా ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ను బ్లేడ్ బాబు అని సంబోధిస్తూ ట్వీట్ లో చెలరేగారు. బండ్లను టార్గెట్ చేస్తూ హరీష్ ను సపోర్ట్ చేస్తూ పీవీపీ చేసిన ట్వీట్ టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదాన్ని ఇంకొంచెం పెంచినట్టు అయ్యింది.

హరీష్ పై పీవీపీ ప్రశంసల వర్షం:
ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌ ట్యాలెంట్‌ను అభినందించారు పీవీపీ. ఎంతో మంది నిర్మాతలు హరీష్ తో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్‌. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్‌. తమ్ముడు స్టార్ట్‌‌ యూవర్‌ కుమ్ముడు’ అని ట్వీట్ చేశారు.

“ఫైటే” అక్కర్లేదు… “ట్వీటే” చాలు:
పీవీపీ చేసిన ట్వీట్ పై హరీశ్ శంకర్ స్పందించారు. ట్వీట్ ద్వారా రియాక్ట్ అయ్యారు. “మీ ‘భాష, భావం రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి “ఫైటే” అక్కర్లేదు… “ట్వీటే” చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్” అంటూ ట్వీట్ చేశారు.

గబ్బర్ సింగ్ తో మొదలైన గొడవ:
కాగా, మే 11తో గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశాడు. అందులో పవన్ కళ్యాణ్, దేవీశ్రీ ప్రసాద్, ఇతర సిబ్బంది థ్యాంక్స్ చెప్పాడు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పొరపాటును గుర్తించిన హరీష్‌ మరో ట్వీట్‌లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించాడు. అయితే అప్పటికే బండ్ల గణేష్ ఫైర్ మీదున్నాడు. లేఖలో తన పేరుని హరీష్ మిస్ చేయడాన్ని బండ్ల జీర్ణించుకోలేకపోయాడు. సోషల్ మీడియా వేదికగా హరీష్‌పై ఫైర్ అయ్యాడు. హరీష్‌కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్‌ చేశాడు. రీసెంట్ గా ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ డైరెక్టర్ హరీష్ పై బండ్ల నిప్పులు చెరిగాడు. తీవ్ర విమర్శలు చేశాడు. ఇలా కొన్ని రోజులుగా బండ్ల, హరీష్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. రీసెంట్ గా ఈ వివాదంలోకి పీవీపీ కూడా ఎంటర్ అయ్యారు. బండ్లను ఏకిపారేసిన పీవీపీ హరీష్ ను సపోర్ట్ చేయడం విశేషం. చివరికి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Read : లాక్ డౌన్ కారణంగా టీవీ నటుడు ఆత్మహత్య