Sukumar : ‘నాన్నకు ప్రేమతో’.. సొంతూరులో స్కూల్ బిల్డింగ్ కట్టించిన సుకుమార్..

సొంత గ్రామమైన మట్టపర్రులో తన తండ్రి కీ.శే. శ్రీ బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరు మీద క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పాఠశాల భవనం నిర్మించారు..

Sukumar : ‘నాన్నకు ప్రేమతో’.. సొంతూరులో స్కూల్ బిల్డింగ్ కట్టించిన సుకుమార్..

Sukumar

Sukumar: తన సొంత గ్రామమైన మట్టపర్రులో తన తండ్రి కీ.శే. శ్రీ బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరు మీద క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పాఠశాల భవనం నిర్మించారు. ఈ భవనాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు, ఆయన సతీమణి తబిత, అన్నయ్య విజయ్‌తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సుకుమార్ సన్నిహితులు-స్నేహితులు పాల్గొన్నారు.

Sukumar

కాగా, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన సుకుమార్, ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Director Sukumar : రాజోలులో దర్శకుడు సుకుమార్ వితరణతో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం..

సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’ చేస్తున్నారు. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. రెండు పార్టులుగా, పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతుంది ‘పుష్ప’. తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చెయ్యనున్నారు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.

Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!