Masks Compulsory In Flights : విమానాల్లో ప్రయాణించే వారికి మాస్కులు తప్పనిసరి..కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్న డీజీసీఏ

దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు అన్ని వేళలా, అన్ని చోట్ల శానిటైజేషన్‌ చేసుకునే ఏర్పాట్లు చేయాలని వెల్లడించింది.

Masks Compulsory In Flights : విమానాల్లో ప్రయాణించే వారికి మాస్కులు తప్పనిసరి..కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్న డీజీసీఏ

mask in flights (1)

Masks Compulsory In Flights : దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికులు అన్ని వేళలా, అన్ని చోట్ల శానిటైజేషన్‌ చేసుకునే ఏర్పాట్లు చేయాలని వెల్లడించింది.

కరోనా నియంత్రణకు సంబంధించిన నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని విమానయాన సంస్థలకు సూచించింది. నిబంధనలు పాటిస్తున్నారో లేదో అనేది పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామని డీజీసీఏ తెలిపింది. కరోనా నియంత్రణ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు బుధవారం విమానయాన సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది.

India Corona Cases : దేశంలో కొత్తగా 9062 కరోనా కేసులు, 36 మరణాలు

ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఆగస్టు1వ తేదీ నుంచి కరోనా వైరస్ తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత 15 రోజుల్లో కరోనా కేసులు రెండు రెట్లు పెరిగాయి. ఐసీయూలో చేరే కరోనా రోగుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది.

గత శనివారం నుంచి ప్రతి రోజూ ఐదు కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు 16న ముంబైలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు కేటాయించిన ఐసీయూ బెడ్లు నిండిపోయాయి.