Directors : మేము రెడీ.. మీరు రెడీ నా..?

లాక్‌డౌన్ నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ చెయ్యడంతో మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు మేకర్స్..

Directors : మేము రెడీ.. మీరు రెడీ నా..?

Directors Ready To Start New Movies With Tollywood Big Stars

Directors: కరోనాతో షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. లాక్‌డౌన్ నెమ్మది నెమ్మదిగా రిలాక్స్ చెయ్యడంతో మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పాత సినిమాలు చకచకా ఫినిష్ చేసి కొత్త సినిమాల్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్న డైరెక్టర్లెవరో చూద్దాం.

షూటింగ్స్ మళ్లీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపించడంతో మేకర్స్ అందరూ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటినుంచో కలలు కంటున్న తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌ని ట్రాక్ ఎక్కించడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్లు. ఆల్రెడీ బన్నీతో సినిమా అనౌన్స్ చేసిన కొరటాల ఇప్పుడు సడెన్‌గా ఎన్టీఆర్ సినిమాకి స్విఛ్ ఆన్ అయిపోయారు. ‘ట్రిపుల్ ఆర్’ కంప్లీట్ చేసుకుని ఎన్టీఆర్, ‘ఆచార్య’ కంప్లీట్ చేసుకుని కొరటాల.. ఈ క్రేజీ కాంబినేషన్‌ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు.

మెగాస్టార్‌తో సినిమా ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ మోహన్ రాజా. మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాని చిరంజీవితో రీమేక్ అనౌన్స్ చేశారు మోహన్ రాజా. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేస్కున్న డైరెక్టర్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు.

దాదాపు సంవత్సరంన్నర నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్. లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్‌‌తో స్టార్ట్ అవ్వాల్సిన సినిమాకి కోవిడ్ బ్రేక్ వేసేసింది. అయితే లేటెస్ట్‌గా మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చెయ్యడంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్‌ని ఎలాగైనా హిట్ చెయ్యాలని ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌తో షూట్‌కి రెడీ అవుతున్నారు.

పరిస్థితులు చక్కబడిన తర్వాత ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ అవ్వడంతో మరోసారి పవర్ స్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు హరీష్. ఇప్పటికే సెట్స్ మీద రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ రెండూ అయ్యే లోపే.. హరీష్.. పవన్‌తో చెయ్యబోయే సినిమాని లైన్లో పెట్టడానికి ఆగస్ట్ నుంచి షూటింగ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్న రవితేజతో సినిమా స్టార్ట్ చేస్తున్నారు కొత్త డైరెక్టర్ శరత్ మండవ. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘ఖిలాడి’ షూటింగ్ లాస్ట్ స్టేజ్‌లో ఉండడంతో ఇప్పటికే స్క్రిప్టింగ్ కంప్లీట్ చేసి సినిమా అఫీషియల్‌గా మొదలు పెట్టిన శరత్.. త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళుతున్నారు.

లవర్ బాయ్ ‘అఖిల్’ తో సినిమా అనౌన్స్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. పెద్ద హీరోల్ని సక్సెస్ ఫుల్‌గా హ్యాండిల్ చేస్తున్న సురేందర్ రెడ్డి.. అఖిల్‌కి మాంచి కమర్షియల్ హిట్ కోసం కథ సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసిన సురేందర్.. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు.

‘రెడ్’ తో ఎక్స్‌పెక్ట్ చేసిన సక్సెస్ కొట్టలేకపోయిన రామ్ ఈ సారి తమిళ్ డైరెక్టర్ లింగుస్వామిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ మూవీస్‌తో ట్రెండ్ సెట్ చేసిన లింగుస్వామి.. రామ్ కోసం క్రేజీ స్టోరీ రెడీ చేశారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి అంతా రెడీ చేసుకున్నారు.

మరో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా లాంగ్ బ్రేక్ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ని పట్టాలెక్కించబోతున్నారు. వెంకటేష్‌తో రేస్ కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో ప్లాన్ చేసిన సినిమా త్వరలోనే మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ ‘రిపబ్లిక్’ సినిమాని కంప్లీట్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్‌తో కొత్త డైరెక్టర్ కార్తీక్ కూడా తమ అప్ కమింగ్ మూవీ షూట్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.