‘ఆహా’ లో అదరగొడుతున్న ‘డర్టీ హరి’

‘ఆహా’ లో అదరగొడుతున్న ‘డర్టీ హరి’

Dirty Hari: ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు.. కొంత విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ట్రెండీ ఫిల్మ్ ‘డర్టీ హరి’. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు.

‘డర్టీ హరి’లో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరో హీరోయిన్స్.. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది ‘డర్టీ హరి’..

సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఎం.ఎస్. రాజుని అభినందిస్తున్నారు. ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్ బుర్రా తదితరులు సినిమా చూసి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.