‘డర్టీ హరి’ ట్రైలర్ : రొమాన్స్‌తో పాటు సస్పెన్స్ కూడా..

  • Published By: sekhar ,Published On : December 9, 2020 / 12:23 PM IST
‘డర్టీ హరి’ ట్రైలర్ : రొమాన్స్‌తో పాటు సస్పెన్స్ కూడా..

Dirty Hari Trailer 2:ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ట్రెండీ ఫిల్మ్ ‘డర్టీ హరి’. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు.


‘డర్టీ హరి’లో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరో హీరోయిన్స్.. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ రెండో ట్రైలర్ బుధవారం విడుదల చేశారు.
ట్రైలర్‌ని బట్టి ఈ సినిమాలో రొమాన్స్‌తో పాటు సస్పెన్స్ కూడా ఉందని అర్థమవుతోంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.



డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీ ద్వారా ‘డర్టీ హరి’ ప్రీమియర్ కానుంది. సంగీతం : మార్క్.కె.రాబిన్, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి.