Sharwa30: శర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం.. ప్రోమో విడుదల!
ప్రామిసింగ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో రూపొందుతోన్న 30వ సినిమా `ఒకే ఒక జీవితం`. ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Captivating World of Adhi: ప్రామిసింగ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో రూపొందుతోన్న 30వ సినిమా `ఒకే ఒక జీవితం`. ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగులు రాస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని చిత్రయూనిట్ చెబుతుంది.
ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంబంధించి ఒక స్నీక్ పీక్ ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో పాట పాడమని కొందరు శర్వానంద్ణు కోరడం.. అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ ప్రోమో ముగుస్తుంది. చివరలో శర్వానంద్ గిటార్ వాయిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ లుక్‌తో శర్వానంద్ అటెన్షన్ క్రియేట్ చేసినట్లుగా అనిపిస్తుంది.
శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి `డియర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే `ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తవగా.. త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది అని చిత్రయూనిట్ చెబుతోంది.