DJ Tillu: ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేసిన ‘డీజే టిల్లు’ టీమ్!

అప్పటి వరకు సినిమా చూస్తూ తెరమీద నాయకా నాయికలను, వారి నటనను చూస్తూ.. నవ్వులతో మునిగిపోయిన ప్రేక్షకులకు అంతలోనే థియేటర్లో హీరో, హీరోయిన్స్ ఎదురయ్యే సరికి వారి ఆనందంతో ధియేటర్..

DJ Tillu: ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేసిన ‘డీజే టిల్లు’ టీమ్!

Dj Tillu (2)

DJ Tillu: అప్పటి వరకు సినిమా చూస్తూ తెరమీద నాయకా నాయికలను, వారి నటనను చూస్తూ.. నవ్వులతో మునిగిపోయిన ప్రేక్షకులకు అంతలోనే థియేటర్లో హీరో, హీరోయిన్స్ ఎదురయ్యే సరికి వారి ఆనందంతో ధియేటర్ మారుమ్రోగింది. ఈ సంఘటన విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ లో జరిగింది. ఫిబ్రవరి 14 వాలంటైన్ డే రోజున ‘డీజే టిల్లు’ టీమ్ ధియేటర్లో సందండి చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డీజే టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.

Anantha Sreeram: కళావతి పాట పల్లవి కోసం 42 వెర్షన్లు రాసిన అనంత శ్రీరామ్!

డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించగా సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డీజే టిల్లు టీమ్ విజ‌య‌యాత్రలో భాగంగా విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ ని సంద‌ర్శించారు. ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూసిన టీమ్ త‌మ ఆనందాన్ని ప్రేక్ష‌కుల‌తోనూ మీడియాతోనూ పంచుకున్నారు. డీజే టిల్లు అంటూ ప్రేక్ష‌కుల అరుపుల‌తో ధియేటర్ మరింత జోష్ ని నింపుకుంది.

Anasuya: లాంప్ లైట్ వెలుతురులో అనసూయ ముద్దులు..!

ఈసంద‌ర్భంగా హీరో సిద్దు జోన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ…’తెలంగాణా యాసతో వ‌స్తున్నాం ఎలా ఉంటుంది ఈ సినిమా నైజాం వ‌ర‌కూ మాకు ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఆంధ్ర‌లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజ‌యవాడ‌లో ఆడియ‌న్స్ తో క‌ల‌సి చూశాక మంచి సినిమా ఎక్క‌డైనా మంచి సినిమానే అని ప్రేక్ష‌కులు రుజువు చేశారు. చాలా ఆనందంగా ఉంది. డీజే టిల్లు అనే క్యారెక్ట‌ర్ రాయ‌డం, చేయ‌డం ఒక క‌త్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్ష‌కులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజ‌యం అందించారు. ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన కిక్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మిమ్మ‌ల్ని ఏడిపించేంత న‌వ్విస్తాడు.. దానికి నాది గ్యారెంటీ అన్నారు.

Krithi Shetty: వారియర్‌కి జంటగా మహాలక్ష్మి.. ఫస్ట్ లుక్ రిలీజ్!

ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ విజ‌యంతో ఏం మాట్లాడాలో అర్దం కావ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌కు చాలా థ్యాంక్స్. మా న‌మ్మ‌కాన్ని ప‌దింత‌లు చేసి ప్రేక్ష‌కులు మాకు విజ‌యం అందించారు. ఈ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేయ‌డంలోనూ సిద్దూ పాత్ర చాలా ఉంది. విజ‌య‌వాడలో ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఆనందాన్ని ప‌దింత‌లు చేసింది అన్నారు.

DJ Tillu: ఈ ఏడాది ఇప్పటి వరకు సినిమాల్లో టాప్ టిల్లుగాడే!

హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.. ‘నా మొద‌టి థియేట‌ర్ విజిట్ ఇది. నా సినిమా ఆడియ‌న్స్ తో చూడ‌టం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. థియేట‌ర్ లో రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. డీజే టిల్లు ఒక సూప‌ర్ ఫ‌న్ రైడ్.. ప్రేక్ష‌కులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అన్నారు. ప్రేక్షకాభిమానుల ఆనందాన్ని తమ గుండెల్లో నింపుకొని మరిన్ని ధియేటర్ ల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించింది చిత్ర యూనిట్.