Children : చలికాలంలో ఈ ఆహారాలను పిల్లలకు అసలు పెట్టొద్దు…ఎందుకంటే?

ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు పిల్లలకు అందివ్వకూడాదు. చలికాలంలో ఈఆహారాలను పెట్టటం వల్ల సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే కొవ్వు, నూనెలు వారికి శాశ్వత సమస్యలు కలిగిస్తాయి.

Children : చలికాలంలో ఈ ఆహారాలను పిల్లలకు అసలు పెట్టొద్దు…ఎందుకంటే?

Children Food

Children : చలికాలం పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆవిషయంలో ముందుగా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ముఖ్యంగా వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పిల్లలు ఇంట్లో వండిన ఆహారం కంటే జంక్ ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడతారు. అలా కాకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను వారికి అలవాటు చేయాలి. ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, లాంటి వాటిని చలికాలంలో పిల్లలకు ఎంత దూరం పెడితే అంత మంచిది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వారిలో నిస్సత్తువను కలిగించే అవకాశం ఉంటుంది.

ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు పిల్లలకు అందివ్వకూడాదు. చలికాలంలో ఈఆహారాలను పెట్టటం వల్ల సమస్యలు వస్తాయి. వీటిలో ఉండే కొవ్వు, నూనెలు వారికి శాశ్వత సమస్యలు కలిగిస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలు వారికి చాలా ప్రమాదకరం. వేపుడు పదార్ధాలు లాలాజల గాఢతను పెంచుతాయి. దీని వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా పిల్లలకు చెక్కర తో తయారైన పదార్ధాలను ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. వీటిని తినకుండా చూడాలి. పిల్లల శరీరంలో చెక్కర శాతం పెరిగితే తెల్లరక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీని వల్ల వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది.

ఇవి పిల్లలు మారం చేసి మరీ కొనే పదార్ధాలు.. ఇందులో తీయని సిరల్స్, సొడాలు, కోల్డ్ డ్రింక్స్, క్యాండీస్, చాకోలెట్స్ వగైరా ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉంటాయి. వీటిని పిల్లలు తినకుండా చూసుకోవాలి. చలికాలంలో పిల్లలకు ముఖ్యంగా ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను ఉన్న ఆహార పదార్థాలను తగ్గిస్తూ, పోషకవిలువలను ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం పిల్లలకు చాలా మంచిది. చలికాలంలోనే కాదు ఎప్పుడైనా పీచు పదార్థాలు ఉన్న ఆహారం వల్ల పిల్లలు బలంగా ఉంటారు.

మాంసాహారం కంటే పిల్లలకు శాకాహారం ఎక్కువగా ఇవ్వడమే మంచిది. ఇది జీర్ణ ప్రకియకు సులువుగా ఉంటుంది. శాకాహారంలో కూడా ఆకుకూరలు చాలా ముఖ్యం. ఇక ఎలాంటి పండ్లు అయినా పిల్లలకు ఎప్పటికప్పుడు తినిపిస్తూ ఉండాలి.