Pm Boris : గొడుగు తెరుచుకోక ప్రధాని అవస్ధలు

అక్కడే ఉన్న ప్రిన్స్ చార్లెస్ తన వద్ద ఉన్న గొడుగును ఓపెన్ చేసుకుని తల తడవకుండా గొడుగును పట్టుకున్నారు.

Pm Boris : గొడుగు తెరుచుకోక  ప్రధాని అవస్ధలు

Boris

Pm Boris : ప్రధానమంత్రి అంటే హంగు హంగామా అన్ని ఉంటాయని అంతా అనుకుంటారు. ఆయన వెంట అవసరమైన వాటిని అందించేందుకు నిత్యం పక్కనే ఎవరో ఒకరు సేవకలుంటారని భావిస్తూ ఉంటాం..కాని ఇది భారత్ లాంటి దేశాల్లో పరిస్ధితి. కొన్ని దేశాల ప్రధాన మంత్రులు చాలా సింపుల్ గా ఉంటారు. తమ పని తామే చేసుకుంటుంటారు. ఇదే కోవలే బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్స్ న్ కూడా వస్తారు.

ఎప్పుడు సింపుల్ గా ఉండే ప్రధాని బోరిస్ కు, ఓగొడుగు, పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. విధినిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల స్మారక దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని బోరిస్ తోపాటు, ప్రిన్సిచార్లెస్, ఇతర అధికార, అనధికార ప్రముఖులంతా హజరయ్యారు. వేడుకలు ఒకవైపు జరుగుతుండగా చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది.

అక్కడే ఉన్న ప్రిన్స్ చార్లెస్ తన వద్ద ఉన్న గొడుగును ఓపెన్ చేసుకుని తల తడవకుండా గొడుగును పట్టుకున్నారు. అయితే మిగిలిన వారంతా చిన్నవర్షం కావటంతో గొడుగులు లేకుండానే కార్యక్రమాన్ని వీక్షిస్తుండిపోయారు. అయితే ప్రధాని బోరిస్ వర్షపు జల్లులకు తన తల తడుస్తుందేమోనని చేతిలో ఉన్న గొడుగును ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది ఓపెన్ కాలేదు.

ఓపెన్ కాని చేతిగొడుగును సవరించి మరోసారి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా ఓపెన్ అయ్యింది కానీ, గొడుగు కాస్తా బోర్లాపడింది. వెంటనే పక్కనే ఉన్న వారు అలా కాదు అంటూ దానిని సరిచేసి వెనక్కి వెళ్ళిన గొడుగును క్రిందికి దింపే ప్రయత్నం చేశారు. గొడుగుతో ప్రధాని బోరిస్ పడుతున్న ఫీట్లు చూసిన చుట్టుపక్కల వారంతా పకపక నవ్వుకున్నారు.

ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారియి. ప్రధాని బోరిస్ నే గొడుగు తిప్పలు పెట్టిందంటూ వీక్షకులు కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి గొడుగులో సపోర్టుగా ఉండే ఇనుప సువ్వల జాయింట్లు ఊడిపోయి ఉండటం వల్లే గొడుగు సరిగా తెరిచుకోలేదు.