Health : ఈ సమస్యలుంటే వైద్యుని అవసరం తప్పనిసరి?

తలతిరగటం, చికాకుగా ఉండటం వంటివి పక్షవాతానికి సంకేతాలు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెను వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకుంటే రాబోయే ముప్పునుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది.

Health : ఈ సమస్యలుంటే వైద్యుని అవసరం తప్పనిసరి?

Require A Doctor

Health : ఆరోగ్యకరమైన జీవన విధానం, తినే ఆహారం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చాలా మంది అనుకోని పరిస్ధితుల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నప్పుడు శరీరం మనకు కొన్ని సంకేతాలను పంపుతుంది. అంతేకాకుండా లక్షణాలు బయటపడతాయి. వీటిని సకాలంలో గుర్తించి వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే ప్రాణాలకు ముప్పులేకుండా చూసుకోవచ్చు. వైద్యుల అవసరం ఎప్పుడు ఉంటుందనే విషయంపై చాలా మందికి పెద్దగా అవగాహన ఉండదు. ఎలాంటి సందర్భంలో వైద్యులు అవసరమౌతారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఛాతిలో ఎడమవైపు నొప్పి వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించటం మంచిదికాదు. ఎసిడిటీ వల్ల కూడా నొప్పి వచ్చినప్పటికీ ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం, చెమటలు పట్టటం వంటివి ఉంటే మాత్రం గుండెకు ఏదో ముప్పు రాబోతుందని గుర్తుంచుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందిలి. శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల సెల్సియస్ దాటిందా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జర్వంతోపాటు, దద్దుర్లు, ఊపిరితీసుకోవటం కష్టంగా మారటం, రక్తస్రావం, మూత్రం తగ్గటం, అదే పనిగా వాంతులు కావటం, కామెర్లు వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుల వద్ద వెళ్ళటం మంచిది.

తలతిరగటం, చికాకుగా ఉండటం వంటివి పక్షవాతానికి సంకేతాలు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెను వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడిని కలిసి తగిన చికిత్స తీసుకుంటే రాబోయే ముప్పునుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. తలనొప్పి, వాతంతులు, తలతిరగటం, సృహకోల్పోవటం వంటివి జరుగుతుంటే మాత్రం బ్రేయిన్ హెమరేజ్, తలలలో ట్యూమర్లు వంటివి వాటివల్ల అయి ఉండొచ్చని అంచనాతో వెంటనే వైద్యుని కలవాలి. నెలరోజుల పాటు దగ్గు సమస్య బాదిస్తున్నా, పొడి దగ్గు, కఫం పడుతూ దగ్గు వస్తున్నా వైద్యుడిని కలిసి టి.బి సమస్య ఉందేమో పరీక్ష చేయించుకోవాలి.

చేతులు, పాదాలు వాపులు కనిపిస్తున్నా అది మూత్ర పిండాలకు సంబంధించి సమస్యగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముందస్తుగా వెళితే చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. పొత్తి కడుపులో నొప్పి, విరేచనాలు అవుతుంటే మాత్రం వైద్యుడి వద్దకు వెళ్ళటం మంచిది. పేగు సంబంధిత సమస్యలు ఇందుకు కారణకావచ్చు.