Coffee : రాత్రి సమయంలో కాఫీ తాగి నిద్రపోతున్నారా?..

మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ(సీఎన్ఎఫ్)లో లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది. పీ1 రిసెప్టార్స్

Coffee : రాత్రి సమయంలో కాఫీ తాగి నిద్రపోతున్నారా?..

Coffee

Coffee : ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అలవాట్లు , రోజు వారి దినచర్యలు మారిపోతున్నాయి. ఉరుకులుపరుగుల జీవితం, ఒత్తిళ్ళు కారణంగా కనీసం కంటి నిండా నిద్ర కూడా కరువైపోతుంది. రాత్రి పూట నిద్రపట్టక చాలా మంది ఆరోగ్యానికి హానికలిగించే మత్తుపానీయాలు, సిగరెట్లు, కాఫీలు తాగుతూ ఆరోగ్యానికి తమకుతామే హనిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది రాత్రిళ్ళు తమ వత్తిడిని దూరం చేసుకునేందుకు, ప్రశాంతంగా నిద్రించేందుకు కాఫీ తాగి పడుకుంటున్నారు. కాఫీ అనేది ప్రస్తుతం ప్రజల జీవన, ఆహార అలవాట్లలో భాగమై పోయింది.

రాత్రి సమయంలో కాఫీ తాగటం ఏమాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్పప్రభావాలు పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కాఫీ లేదా టీ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన కేంద్రీనాడీ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి.

మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ(సీఎన్ఎఫ్)లో లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది. పీ1 రిసెప్టార్స్ పై ఈ కెఫిన్ ప్రభావం చూపి అడెసినోసిన్ ను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీ తాగిన తర్వాత మనకు నిద్ర రాదు. అయితే నిద్ర పోకుండా ఉండటానికి కాఫీలో కెఫిన్ ప్రతిరోజు కేవలం 400 మిల్లీ గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మనం కాఫీ ,టీ లను మితంగా తీసుకోవడం వల్ల ఎంతో చురుగ్గా మన పనులను మనం చేసుకోగలుగుతాము. కాబట్టి కాఫీ టీ లను పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం తో పాటు మనం అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు. దీనితోపాటు ఆల్కహాల్, సిగరెట్లు, కాఫీ వంటివి నిద్రకు భంగం కలిగించే వాటిని పూర్తిగా దూరంగా ఉండటమే మేలు. రాత్రి భోజన సమయంలో కారం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకుండా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల త్వరగా జీర్ణకావటంతోపాటు, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి పరిస్ధితి ఉండదు.

మరో విషయమేంటంటే కాఫీలో ఉండే కెఫిన్ రక్తనాళాలను కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు వంటి సమస్యలు తద్వారా గుండె జబ్బులకు ఆస్కారం ఏర్పడుతుంది. కెఫిన్ తీసుకునే వారిలో వణుకుడు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. చేతులు, కాళ్ళు వణకటం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. పగలు కూడా కాఫీని పరిమితంగా తీసుకుంటే తప్పులేదు కాని రాత్రి సమయంలో దాని జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. ప్రశాతమైన నిద్రకోసం ఇతర మార్గాలను ఎంచుకోవాలి. యోగా, ధ్యానం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇటీవలికాలంలో యువత రాత్రిళ్ళు నిద్రపోయేందుకు యోగా, ధ్యానం వంటి విధానాలను అనుసరిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు.