Sleeping : బోర్లాపడుకుని నిద్రించే అలవాటుందా?..అయితే జాగ్రత్త?

బోర్లా పడుకోవడం వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా చర్మానికి తగినంత ఆక్సిజన్ అందక చర్మం వత్తిడికి లోనవుతుంది. దీని వల్ల ముడతలు ఏర్పడతాయి.

Sleeping : బోర్లాపడుకుని నిద్రించే అలవాటుందా?..అయితే జాగ్రత్త?

Sleep

Sleeping : మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రశాంతమైన నిద్ర పోగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉండటంతోపాటు, రోజు వారి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనగలుగుతాడు. కొంతమందిలో నిద్రసరిగా పట్టదు. కొన్ని సందర్భాల్లో అనగా పక్క సరిగా కుదరనప్పుడు సరిగా నిద్రపట్టదు. మరికొందరికి వివిధ రకాల భంగిమల్లో పడుకుంటేనే నిద్ర త్వరగా పడుతుంది. అయితే నిద్రపోయే భంగిమల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రించే సమయంలో బోర్లా పడుకునే అలవాటు మంచిది కాదని చెబుతున్నారు. ఇలా పడుకోవటం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మహిళలు బోర్లా పడుకుని నిద్రపోతే అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఎవరైనా ఇలా బోర్లా పడుకుని నిద్రిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయట. ఎక్కవమంది ఆడవాళ్లకు బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల ఛాతీ నొప్పి వస్తుంది. ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది.  నిరంతరం బోర్లా పడుకోవటం వల్ల ఒత్తిడి పడి, నొప్పి అధికమౌతుంది. అలా ఛాతీ నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది.

బోర్లా పడుకోవడం వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా చర్మానికి తగినంత ఆక్సిజన్ అందక చర్మం వత్తిడికి లోనవుతుంది. దీని వల్ల ముడతలు ఏర్పడతాయి. అదే సమయంలో, మంచం మీద ఉండే దుమ్ము,ధూళీ ముఖానికి అంటుకోవటం వల్ల మొటిమలు చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. మహిళలేకాదు, పురుషులు సైతం బోర్లా పడుకునే అలవాటు ఉంటే మానుకోవటం మంచిది. బోర్లా పడుకోవటం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.

బోర్లాపడుకుని నిద్రపోవడం వల్ల హెర్నియేటెడ్ డిస్క్‌లు వంటి దీర్ఘకాలిక మెడ సమస్యలకు దారితీయవచ్చు.ఇలా పడుకున్న సమయంలో తల , వెన్నెముక సమానంగా ఉండకపోవటం వల్ల మెడ నొప్పి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా వెన్నుముక పై వత్తిడి అధికంగా ఉండి వెన్నపూస సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలు బోర్లా పడుకుని నిద్రించరాదు. అలా పడుకుంటే తల్లికే కాదు బిడ్డకు ప్రమాదం ఏర్పడవచ్చు. గర్భిణీ స్త్రీలు కుడివైపు కంటే ఎడమవైపు పడుకోవడం మంచిది.