Nutrients Food : పోషకాలు పోకుండా ఆహారాన్నిఎలా వండాలో తెలుసా?

ఇడ్లీ పిండి, దోసె పిండి, చపాతీ పిండిలో ఉప్పు కలపకపోవడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో కొలెస్ట్రాల్ తొలగించాలంటే దాన్ని నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టాలి.

Nutrients Food : పోషకాలు పోకుండా ఆహారాన్నిఎలా వండాలో తెలుసా?

Cook Food Without Losing Nutrients (1)

Nutrients Food : మనం తినే ఆహారంలో ఖనిజాలు, పోషక విలువలు ఉన్నప్పుడు మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన శక్తి సైతం లభిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చు. ఇందుకుగాను మనం నిత్యం తీసుకునే ఆహారాన్ని పోషకాలు పోకుండా వండటం చాలా అవసరం. ఇందుకు గాను నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నాన్ వెజిటేరియన్ వంటకాలు తినే వారు ఆకు కూరలు, కూరగాయలు కలిపి వండితే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. నాన్ వెజిటేరియన్ పదార్ధాల్లో ఉండే మసాల, గ్రేవీలు ఇందులో ఉండవు. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అన్నాన్ని ప్రెషర్ కుక్కర్ లో లేదా కరెంట్ కుక్కర్ లో వండితే అందులోని పోషక పదార్ధాలు పోవు. అలా కాకుండా బియ్యంలో ఎక్కువగా నీరు పోసి గంజిని వంచటం వల్ల అందులోని పోషకాలు పోతాయి. అన్నం వండే సమయంలో అందులో అయిల్ గాని , ఉప్పు కాని వేయరాదు. చపాతీ పిండిలో అయిల్ గాని, పాలు గాని కలపటం వల్ల శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి.

ఇడ్లీ పిండి, దోసె పిండి, చపాతీ పిండిలో ఉప్పు కలపకపోవడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో కొలెస్ట్రాల్ తొలగించాలంటే దాన్ని నీళ్ళల్లో వేసి బాగా ఉడకబెట్టాలి. ఇలా చేయటం వల్ల అందులోని కొలెస్ట్రాల్ అంతా నీటిపైకి తెట్టులా వస్తుంది. ఆ నీటిని తొలగించి వండుకుని తినటం మంచిది. వండిన వంకాలను ఒక్కసారి మించి వేడి చేయకూడదు. ఎక్కువసార్లు వేడి చేయటం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుంది.

తరిగిన ఆకు కూరల్ని ఎక్కవ నూనెలో వేపటం వంటివి చేయవద్దు. తక్కకువ నూనె పోసి గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆకుకూరల్లో న్యూట్రియంట్లు పోకుండా ఉంటాయి. కూరగాయల్లో పోషక విలువలు పోకుండా ఉండాలంటే ప్రెషర్ కుక్కర్ లో వండుకోవాలి. ఉప్పు వేసిన నీళ్లల్లో పళ్లు , కూరగాయలు, ఆకుకూరలను ఐదు నిమిషాలపాటు ఉంచాలి. తరువాత మంచినీటితో కడుక్కోవాలి. ఇలాంటి కూరగాయలను వినియోగిస్తే శరీరానికి ఎలాంటి హానీ కలుగదు.