Motor Insurance : మీ వాహనానికి ప్రమాదం జరిగితే.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేయాలో తెలుసా?

వాహనం ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏకంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామో సంబంధిత సంస్ధ వెబ్ సైట్ పోర్టల్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ నమోదు చేయాలి.

Motor Insurance : మీ వాహనానికి ప్రమాదం జరిగితే.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేయాలో తెలుసా?

Insurance

Motor Insurance : వాహనం కొనుగోలు చేసిన వెంటనే దానికి ఇన్సూరెన్స్ చేయటం తప్పనిసరి. ప్రతిఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లిస్తాం. ఇన్సూరెన్స్ అనేది ఒకరకం మన వాహనానికి రక్షణ కవచం లాంటిది. అనుకోకుండా ప్రమాదం జరిగి అందులో మన వాహనం డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మనకు అయ్యే ఖర్చులన్నీంటిని సదరు ఇన్సూరెన్స్ సంస్ధ పరిశీలన జరిపి చెల్లిస్తుంది.

చాలా మంది తమ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. అలాంటి వారు తప్పని సరిగా మేము చెప్పబోయే సమాచారం తెలుసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో ఏంచేయాలో తెలియక ఇతరుల సహాయం కోరేకంటే మీరే  క్లెయిమ్ కోసం ఎలా ప్రయత్నించాలో తెలుసుకుంటే మంచిది.

insurance

Insurance

వాహనం ప్రమాదం జరిగిన వెంటనే మనం ఏకంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామో సంబంధిత సంస్ధ వెబ్ సైట్ పోర్టల్ లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ నమోదు చేయాలి. లేకుంటే కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేసి వివరాలు అందించాలి. పాలసీదారుడు, వాహనం, డ్రైవర్, ప్రమాదం ఎలా జరిగింది, పోలీసులు కేసునమోదైతే సంబంధిత ఎఫ్ ఐ ఆర్ కాపీ, పాలసీదారుని బ్యాంకు వివరాలు అందించాలి. వాహనం ఇంజన్ , ఇతర ముఖ్య విడిబాగాలు క్లెయిమ్ చేయాల్సి వస్తే పోలీస్ స్టేషన్ వివరాలు అందించాల్సి అవసరంలేదు.

క్లెయిమ్ కోసం కొన్ని పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్ తోపాటు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సీబుక్, రిపేరింగ్ కోసం ఎంత ఖర్చు అయ్యిందో దానికి సంబంధిచిన బిల్లులు, ప్రమాదం జరిగి ఉంటే పోలీసు ఎఫ్ ఆర్ ఐ కాపీ, దెబ్బతిన బాగాల ఫోటోలు, వాహనం చోరికి గురైతే దర్యాప్తు నివేదిక, సర్వీస్ బుక్ లెట్, వారంటీ కార్డులు అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలి.

యాక్సిడెంట్ జరిగితే ఆతరువాత వాహనాన్ని రిపేరు గ్యారీజికి తీసుకువెళ్ళాలి. రిపేరుకు అయిన ఖర్చుకు సంబంధించిన బిల్లులను వారి నుండి తీసుకుని క్లెయిమ్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. క్లెయిమ్ కు ధరఖాస్తు చేసుకున్న తరువాత సదరు ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన సర్వేయర్ వాహనానికి జరిగిన నష్టాన్ని సర్వేచేసి ఓ అంచనా తయారు చేసుకుంటాడు. రిపేరు కయ్యే ఖర్చులపై అమోదం తెలుపుతారు. ఎక్కవ మొత్తంలో రిపేరు ఖర్చు అయ్యే పరిస్ధితి ఉంటే అది పాలసీ దారుడే భరించాల్సి ఉంటుంది.

రోడ్డుపైకి వాహనం వచ్చిందంటే ఎప్పుడు ఏంజరుగుతుందో అర్ధంకాని పరిస్ధితి. అయితే చాలా మంది ఇన్సూరెన్స్ కట్టటాన్ని నిర్లక్స్యం చేస్తారు. ఇన్ని సార్లు కట్టాను ఒక్కసారిగా కూడా క్లెయిమ్ చేయలేదు. ఇన్స్ రెన్స్ కట్టడం దండగంటూ మాట్లాడుతుంటారు. అయితే అనుకోకుండా, ఎదురయ్యే ప్రమాదాల సమయంలో ఇన్సూరెన్స్ బాధితుల కుటుంబాలకు ఆర్ధిక భద్రతను కల్పించడంటో ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. కాబట్టి వాహనాలు ఉన్నవారు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవటంతోపాటు, ప్రమాదం జరిగిన సందర్భంలో ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోవటం మంచిది.