Tech Neck Syndrome : టెక్ నెక్ సిండ్రోమ్ అంటే తెలుసా! దాని వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటే!

కంప్యూటర్ వద్ద పనిచేసే వారు నడుముకు అనుకూలంగా ఉండేలా తగిన కూర్చీని ఏర్పాటు చేసుకోవాలి. వెన్ను వంగిపోకుండా నిటారుగా కూచోవాలి.ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవటం మంచిది దీని వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతోపాటు మెడ సరైన స్ధితిలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

Tech Neck Syndrome : టెక్ నెక్ సిండ్రోమ్ అంటే తెలుసా! దాని వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి ఉందంటే!

Tech Neck Syndrome : టెక్ నెక్ అనేది మెడ నొప్పికి ఆధునికంగా పెట్టిన పేరు, నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి ఈతరహా టెక్ నెక్ పెయిన్ వస్తుంది. ఎక్కువగా చదవడం లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ వైపు చూడటం వల్ల వెన్నెముక పదేపదే ఒత్తిడికి గురవడం వల్ల వస్తుంది.

కంప్యూటర్‌ ముందు కూర్చుని పని చేస్తున్నప్పుడు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను చూస్తున్నప్పుడు తల బరువుకు మెడ వెనుక కండరాలు కుదించబడతాయి. క్రిందికి చూస్తే తలకున్న కండరాలు మరింత చురుకుగా పనిచేస్తాయి. దీనివల్ల కండరాలు ఒత్తిడికి గురవుతాయి. దీంతో నొప్పి కలుగుతుంది.. దీనినే ఇటీవలి కాలంలో టెక్ నెక్ అని పిలుస్తున్నారు. దీని వల్ల మెడ వెనుక కండరాలు మాత్రమే కాకుండా ఇంటర్‌వెటెబ్రెరల్ డిస్క్‌లు కూడా ఒత్తిడికి గురవుతాయి.

ఈ టెక్ నెక్ సిండ్రోమ్ కారణంగా తలనొప్పి, మెడ, భుజాల పైభాగంలో నొప్పి, చేతుల్లో జలదరింపు, నొప్పి, తిమ్మిరి, వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెన్నెముక సహజ వక్రతను కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం ఫోన్‌లో, కంప్యూటర్‌లో గడిపే సమయం కారణంగానే ఈతరహా మెడ నొప్పి వస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. దీర్ఘకాలం తల వంచి ఉండటం వల్ల కండరాల అసమతుల్యత, భంగిమల్లో మార్పుకు దారితీస్తుంది.

జాగ్రత్తలు పాటించటం ద్వారా ;

కంప్యూటర్ వద్ద పనిచేసే వారు నడుముకు అనుకూలంగా ఉండేలా తగిన కూర్చీని ఏర్పాటు చేసుకోవాలి. వెన్ను వంగిపోకుండా నిటారుగా కూచోవాలి.ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవటం మంచిది దీని వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతోపాటు మెడ సరైన స్ధితిలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. మెడ నొప్పి అని పిస్తే ఫిజియోథెరపిస్ట్ ని సంప్రదించి అవసరమైన మసాజ్ లను , వ్యాయామాల గురించిన సమాచారం తెలుసుకుని అనుసరించండి. కంప్యూటర్‌ మానిటర్‌, సెల్ ఫోన్ ను కంటికి సమాన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ ముందు గడిపే సమయాన్ని పరిమితం చేయటం ద్వారా సమస్య రాకుండా చూసుకోవచ్చు.

మెడ కండరాల్లో నొప్పి ఉంటే మాత్రం తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. అలాకాకుండా అదే పనిగా కంప్యూటర్ ముందు గడిపితే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కంప్యూటర్‌ ముందు పనిచేస్తున్న సందర్భంలో తలను అటూఇటూ వంచటం, కిందికీ పైకీ తిప్పటం చేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే మెడకండరాలపై మరింత వత్తిడి పడే అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటి నొప్పికి అయింట్ మెంట్ అప్లై చేసుకోవాలి. మసాజ్ వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.