Lic Credit Card : ఎల్ ఐ సీ క్రెడిట్ కార్డ్ తో బెనిఫిట్స్ ఎన్నో తెలుసా…

లూమైన్ కార్డుతో 100 రూపాయలఖర్చుతో మూడు డిలైట్ పాయింట్లు పొందవచ్చు. ఎక్లాట్ కార్డుతో 100 రూపాయల ఖర్చు చేస్తే 4పాయింట్లు లభిస్తాయి.

Lic Credit Card : ఎల్ ఐ సీ క్రెడిట్ కార్డ్ తో బెనిఫిట్స్ ఎన్నో తెలుసా…

Lic

Lic Credit Card : ఇటీవలికాలంలో క్రెడిట్ కార్డ్స్ వినియోగం బాగా పెరిగింది. వివిధ బ్యాంకులు కస్టమర్లకు క్రెడిట్ కార్డుల సౌకర్యం కల్పిస్తున్నాయి. కస్టమర్ క్రెడిట్ స్కోర్, నెలవారీ అదాయం అధారంగా కార్డు యొక్క క్రెడిట్ పరిమితిని ముందుగానే నిర్ణయిస్తారు. కార్డు తీసుకున్న వారు దానితో తమకు అవసరమైన కొనుగోళ్లకు క్యాష్ లేకుండానే చెల్లింపులు చేయటానికి అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఎల్ ఐసీ సైతం క్రెడిట్ కార్డు సేవలను ప్రారంభిస్తుంది. ఎల్ ఐసీ కార్డ్స్ సర్వీసెస్ లిమిటెడ్ , ఐడీబీఐ బ్యాంకు సంయుక్తంగా రెండు క్రెడిట్ కార్డులను తీసుకురానున్నాయి.

నిర్ధిష్టమైన వినియోగదారులతోపాటు, ఎల్ ఐసీ ఏజెంట్లు, పాలసీదారులు, ఉద్యోగులతోపాటు ఇతర అనుబంధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సదుపాయం కల్పించనున్నారు. లూమైన్ ప్లాటినం, ఎల్ ఐసీ సీఎస్ ఎల్ ఎక్లాట్ పేరుతో రెండు వేరియంట్లలో ఈ కార్డులు లభించనున్నాయి. క్రెడిట్ స్కోరుతోపాటు, జీవనశైలికి అనుగుణంగా క్రెడిట్ పరిమితులు ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే…

లూమైన్ కార్డుతో 100 రూపాయలఖర్చుతో మూడు డిలైట్ పాయింట్లు పొందవచ్చు. ఎక్లాట్ కార్డుతో 100 రూపాయల ఖర్చు చేస్తే 4పాయింట్లు లభిస్తాయి. ఈ కార్డులను ఉపయోగించి ఎల్ ఐసీ పాలసీలు చెల్లిస్తే అధిక రివార్డు పాయింట్లు లభిస్తాయి. లూమైన్ కార్డు కలిగిన వారు 60 రోజుల వ్యవధిలో 10వేల రూపాయలు ఖర్చు చేస్తే 1000 రూపాయల వెల్కం బోనస్ డిలైట్ పాయింట్స్ కు అర్హులుగా పరిగణించబడతారు.

ఎక్లాట్ కార్డుదారులు 10వేల రూపాయలు 60 రోజుల వ్యవధిలో ఖర్చు చేస్తే 1500 రివార్డు పాయింట్లు సొంతం చేసుకుంటారు. రెండు కార్డుదారులకు వ్యక్తిగత ప్రమాదం,శాశ్వత వైకల్యం, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, జీరో లాస్ట్ కార్డ్, క్రెడిట్ షీల్డ్ కవర్ వంటి భీమా కవరేజిలు కలిగి ఉంటారు. 400 రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలపై 1శాతం సర్ చార్జి మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది.

కార్డు ప్రాసెసింగ్ , జప్తు చార్జీలు లేకుండా 3వేల రూపాలయల కంటే ఎక్కవ చెల్లింపుల పై ఈ ఎంఐకి మార్చుకునే అవకాశం కూడా ఉంది. కార్డు దారులు తమ సౌకర్యాన్నిబట్టి, చెల్లింపులు చేసే సామర్ధ్యాన్ని బట్టి 3 నెలల నుండి 6 నెలలు, 9 నెలలు, 12 నెలల వరకు ఈ ఎం ఐ ఆప్షన్లు ఎంచుకునేందుకు అవకాశం ఉంది. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ కు యాక్సెస్ పొందవచ్చు. ఎల్ ఐసీ సీఎస్ ఎల్ రూపేతో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఐడీబీఐ బ్యాంక్ ఎండీ , సీఈఓ రాకేశ్ శర్మ తెలిపారు.