Ginger : వేసవిలో అల్లం అతిగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

అల్లం కడుపులో బర్నింగ్ లక్షణాలను కలిగిస్తుంది. కాబట్టి వేసవిలో తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవటం మంచిది. రక్తస్రావం లోపాలు ఉన్నవారు అల్లం వాడకాన్ని నివారించటం శ్రేయస్కరం.

Ginger : వేసవిలో అల్లం అతిగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

Ginger

Ginger : భారతీయ వంటలలో అల్లం అత్యంత ముఖ్యమైన స్ధానాన్ని ఆక్రమించింది. పురాతన కాలం నుంచే అల్లంను ఉపయోగిస్తున్నారు. అల్లంను కూరల్లో రుచి, వాసన కోసం వినియోగిస్తుంటారు. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చేందుకు, వివిధ రకాల వ్యాధులను దరిచేరకుండా ఉండేందుకు అల్లం ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేద ప్రకారం అల్లం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది.

జీర్ణ సమస్యలు ఎలాంటివైనా సరే.. అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్ణం, గ్యాస్‌, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అల్సర్లు వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. అలాగే వికారం, వాంతులు కూడా తగ్గుతాయి. దంత సమస్యలు, నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారికి అల్లం వల్ల మేలు జరుగుతుంది. సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించేందుకు కూడా అల్లం పనిచేస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.

అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులు , కీళ్ల నొప్పులు తదితర సమస్యలు తగ్గించేందుకు దోహదపడతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణం అల్లంలో ఉంది. రక్త సరఫరాను మెరుగు పడి హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.అధిక బరువును తగ్గించడంలో ఉపకరిస్తుంది. అల్లంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వేసవి కాలంలో దీనిని తీసుకోవటం జాగ్రత్తలు పాటించటం మంచిది.

వేసవిలో అల్లం తీసుకుంటే?

ఎన్నో ప్రయోజనాలు కలిగిన అల్లం శరీరంలో వేడిని పుట్టిస్తుంది. శీతాకాలంలో దీనిని తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది. అయితే వేసవి కాలంలో మాత్రం అల్లంలో వేడి గుణం శరీరంలో ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుంది. అసలే వేసవి వేడికి అల్లం వేడి కూడా తోడైతే కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వేసవిలో అల్లం వాడకం హానికరం కాకపోయినప్పటికీ తక్కువ మోతాదులో ఈ మసాలను వాడుకోవటం మంచిది. వేసవిలో అల్లంతో కూడిన ఆహారాన్ని తీసుకున్న వెంటనే నుదిటి, ముఖం, చర్మం మరియు మెడ చెమటలు పోస్తాయి.

అల్లం కడుపులో బర్నింగ్ లక్షణాలను కలిగిస్తుంది. కాబట్టి వేసవిలో తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవటం మంచిది. రక్తస్రావం లోపాలు ఉన్నవారు అల్లం వాడకాన్ని నివారించటం శ్రేయస్కరం. ఒక వేళ అలాంటి వారు అల్లం తినటం వల్ల అధిక రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ మరియు గుండె సమస్యలున్న వారు అల్లం వాడకం గురించి వైద్యుడిని సంప్రదించి తీసుకోవటం మంచిది. ఎందుకంటే వేసవిలో అల్లం తీసుకోవటం వల్ల అలాంటి వారు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బీపీ, షుగర్ లు ఎక్కువ మోతాదులో ఉండి మందులు తీసుకునేవాళ్లు అల్లం తీసుకోకపోవడం మంచిది.

గర్భవతులు వేసవి కాలంలో అల్లానికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అల్లానికి కండరాలను బలపర్చి, వాటిని యాక్టివ్ చేసే లక్షణం ఉంది. దీంతో నెలలు నిండుతున్న సమయంలో తీసుకుంటే త్వరగా కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. వేసవిలో గర్భవతులు అల్లం ఎక్కువగా తీసుకోకూడదు. సాధారణ వ్యక్తులు వేసవిలో అల్లం ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచన సమస్యలు వస్తాయి. ప్రేగుల లోపల ఉండే ఆహార వ్యర్థాలను బయటకు విరోచనాల రూపంలో నెట్టివేయబడతాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండెల్లో తేలికపాటి మంటను కలిగిస్తుంది. త్రేన్పులుఎక్కువగా వస్తాయి. కళ్ళు దురద, చర్మం ఎర్రబడటం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు.