Cashews : రోజు జీడిపప్పు తింటే శరీరంలో ఏంజరుగుతుందో తెలుసా?

జీడిప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. దీంతో విట‌మిన్లు ఎ, డి, ఇ, కెలు ఆ కొవ్వుల్లో క‌రుగుతాయి. అవి మ‌న శ‌రీరానికి అందుతాయి.

Cashews : రోజు జీడిపప్పు తింటే శరీరంలో ఏంజరుగుతుందో తెలుసా?

Cashew Nuts

Cashews : జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇత‌ర పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. జీడిపప్పు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా ప‌నిచేస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఈ ప‌ప్పులో అధిక పరిమాణంలో ఆరోగ్య‌క‌ర‌మైన‌ కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల జీడిప‌ప్పును తిన‌వ‌చ్చు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. నిజానికి జీడిపప్పులోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగానే ఉంటాయి. దీన్ని భార‌తీయులు ఎంతో కాలం నుంచి ప‌లు కూర‌ల్లో పేస్ట్ రూపంలో వేస్తున్నారు. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అనేక మంది జీడిప‌ప్పును నెయ్యిలో వేయించుకుని తింటారు. మరికొందరు నూనెలో వేయించి ఉప్పు, కారం చ‌ల్లుకుని తింటారు. వీటిని ఎలా తిన్నా మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌నే కలిగిస్తాయి. జీడిపప్పును ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు…

30 గ్రాముల జీడిప‌ప్పు ద్వారా మ‌న‌కు 155 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే 9.2 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 5.1 గ్రాముల ప్రోటీన్లు, సూక్ష్మ మోతాదులో విట‌మిన్ ఇ, బి6, విట‌మిన్ కె10, కాల్షియం ల‌భిస్తాయి. జీడిప‌ప్పులో జింక్‌, మెగ్నిషియం, కాప‌ర్‌, పాస్ఫ‌ర‌స్‌, ఫోలిక్ యాసిడ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి అనేక రకాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

జీడిపప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి బరువును తగ్గించడంలోనూ సహాయపడ‌తాయి. కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. బరువును తగ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు జీడిప‌ప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే మేలు జ‌రుగుతుంది. జీడిపప్పులో క్యాల‌రీలు అధికంగా ఉంటాయి.. వాస్త‌వ‌మే.. కానీ.. నిజానికి ఇవి ఇత‌ర ప‌దార్థాల్లా బ‌రువును పెంచ‌వు.. త‌గ్గిస్తాయి. రీసెర్చ‌ర్లు కూడా ఇదే చెబుతున్నారు.  జీడిప‌ప్పు వృక్ష సంబంధ‌మైంది. జంతు సంబంధ ప‌దార్థాల్లో ఉండే కొవ్వు మ‌న బ‌రువును పెంచుతుంది. కానీ వృక్ష సంబంధ ప‌దార్థాల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. క‌నుక ఇవి మ‌న బ‌రువును త‌గ్గిస్తాయి.

జీడిప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. దీంతో విట‌మిన్లు ఎ, డి, ఇ, కెలు ఆ కొవ్వుల్లో క‌రుగుతాయి. అవి మ‌న శ‌రీరానికి అందుతాయి. అలాగే ఈ ప‌ప్పులో ఆరోగ్య‌క‌ర‌మైన పాలీ అన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి సూక్ష్మ మోతాదులో మ‌న‌కు అవ‌స‌రం అవుతాయి. దీంతో శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. త‌ద్వారా గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. అలాగే గుండె జ‌బ్బులు లేని వారికి ఆ జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

జీడిప‌ప్పు నుంచి తీసే నూనె మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. ఈ నూనెలో జింక్‌, మెగ్నిషియం, పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. అలాగే చ‌ర్మ క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. జీడిపప్పును రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే స్టెరిక్ ఆమ్లం జీడిపప్పులో ఉంటుంది. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు.

నిత్యం త‌గిన మోతాదులో జీడిప‌ప్పును తింటే ర‌క్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. దీంతో కాప‌ర్ కూడా త‌గ్గుతుంది. క‌నుక ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. నిత్యం జీడిప‌ప్పును తినాలి. జీడిప‌ప్పులో కాప‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త ఏర్ప‌డ‌కుండా చూస్తుంది. ఇత‌ర ర‌క్త సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. జీడిప‌ప్పును నిత్యం తిన్నా లేదా ఆ ప‌ప్పు నుంచి తీసిన నూనెను నేరుగా వాడినా వెంట్రుక‌లు సంర‌క్షింప‌బ‌డ‌తాయి. జీడిప‌ప్పులో కాప‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది చ‌ర్మం, వెంట్రుక‌ల్లో ఉండే మెల‌నిన్ అనే పిగ్మెంట్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

జీడిప‌ప్పు మ‌న కంటి ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం మ‌నం కాలుష్య భ‌రిత‌మైన వాతావ‌ర‌ణంలో ఎక్కువ‌గా తిరుగుతున్నాం. దీంతో కళ్ల‌పై భారం పడి కంటి వ్యాధులు వ‌స్తున్నాయి. అయితే జీడిప‌ప్పును నిత్యం తింటే అందులో ఉండే జియా జాంతిన్ అన‌బ‌డే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ కంటి రెటీనాపై ఓ సుర‌క్షిమైన పొర‌ను ఏర్పాటు చేస్తుంది. దీంతో క‌ళ్లు సంర‌క్షింప‌బ‌డ‌తాయి. ముఖ్యంగా సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం క‌ళ్ల‌పై ప‌డ‌కుండా కాపాడతాయి.

జీడిపప్పు రోజు తినటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగే మాట వాస్తమే అయినప్పటికీ అతిగా తినటం ఏమంత శ్రేయస్కరం కాదు. రోజుకు కేవలం పదిపప్పులను తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది.