Honey : ఏ సందర్భాల్లో తేనెను వాడకూడదో తెలుసా!

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను చాలా మంది వేడి చేస్తుంటారు. ఇలా ఏమాత్రం చేయరాదు.

Honey : ఏ సందర్భాల్లో తేనెను వాడకూడదో తెలుసా!

Honey : తేనే ప్రకృతి సిద్దం గా దొరికే అపురూపమైన ఔషధము. తేనె వల్ల చాలా లాభాలున్నాయి. రోజూ గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు తాగితే బరువు తగ్గుతారు. రాత్రి వేళల్లో పాలు తేనే కలుపుకొని తాగితే చక్కటి నిద్ర వస్తుంది. నిమ్మ రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసం తగ్గిపోతుంది. తేనే లో కొంచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. వీటితోపాటు రోజువారిగా తేనె తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంత మంది , కొన్ని సందర్భాల్లో తేనెను తీసుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను చాలా మంది వేడి చేస్తుంటారు. ఇలా ఏమాత్రం చేయరాదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. తేనెలో రకరకాల పువ్వుల మకరందాలుంటాయి. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

మద్యంలో తేనెను కలుపుకోని తాగకూడదు. మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు. తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు. తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది. తేనెను అదేపనిగా తీసుకోవటం వల్ల, తీపి కారణంగా నోటిలో బ్యాక్టీరియా సమస్య ఉత్పన్నం అవుతుంది. ఈ బ్యాక్టీరియా దంతాలపై చెడు ప్రభావం చూపుతుంది. దీని వల్ల నోటి నుంచి దుర్వాసన కూడా తలెత్తుతుంది.

తేనెను అధికంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రతికూలా ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. తేనెను అధికంగా తింటే డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తేనెలోని తీపి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉందనేది నిపుణులు చెబుతున్నారు. తేనె చక్కెర కంటే తక్కువ తీపిని కలిగి ఉన్నప్పటికీ, బరువు పెంచే అవకాశాలు ఉంటాయి.