Perfumes : పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతున్నారా! అయితే జాగ్రత్త?

పెర్ ఫ్యూమ్స్ చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. దీని గాఢత వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో కొంత అసహనానికి లోనవుతారు.

Perfumes : పెర్ ఫ్యూమ్స్ ఎక్కువగా వాడుతున్నారా! అయితే జాగ్రత్త?

Perfumes

Perfumes : పెర్ ఫ్యూమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పార్టీ, పనిపై బయటకు వెళ్ళే సందర్భంలో, పాఠశాలకు వెళ్ళే పిల్లలు, రాత్రి సమయంలో కొందరు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. పెర్ ఫ్యూమ్స్ వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది. దాని నుండి వచ్చే సువాసన మంచి భావనను కలిగిస్తుంది. పెర్ ఫ్యూమ్ ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కొందరికి గాఢంగా వాసన ఉండే పెర్ ఫ్యూమ్స్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే గాఢత ఎక్కువగా ఉంటే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. మరికొందరికి లైట్ గా ఉండే వాటిని ఇష్టపడతారు. వాటిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

పెర్ ఫ్యూమ్స్ చుట్టు పక్కల వారికి మంచి సువాసనలు కలిగించినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ వాసనలు వారిని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. దీని గాఢత వల్ల తుమ్ములు రావటం, తలనొప్పి వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. దీంతో కొంత అసహనానికి లోనవుతారు. ఈ గాఢత కలిగిన పెర్ ఫ్యూమ్స్ వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫెర్ ఫ్యూమ్స్ లో ఇథనాల్ ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెర్ఫ్యూమ్ ను ఎక్కువగా వాడవద్దు. పెర్ఫ్యూమ్ కొనే ముందు ఏమైనా అలెర్జీలు ఉన్నాయేమో చూసుకోవాలి. పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడితే చర్మం దురద పెడుతుంది. ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాదులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీటితో పాటు పెర్ఫ్యూమ్ లో ఉండే రసాయనాలు పురుషుడి లైంగిక సామర్థ్యంపై కూడా దెబ్బతీస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఫెర్ ఫ్యూమ్స్ పడకపోతే శరీరంలో అనేక లక్షణాలు బయటపడతాయి. తలతిరగటం, దద్దుర్లు, గందరగోళం, మగత, వాంతులు, హృదయ స్పందన రేటులో మార్పులు గమనించవచ్చు. దీర్ఘకాలంలో శ్వాసకోశ వ్యవస్ధపై తీవ్రమైన ప్రభావం చూపి గురక, హర్మోన్ అసమతుల్యత, ఆస్తమా వంటి సమస్యలకు కారణమౌతుంది. తక్కువ మొత్తంలో స్ప్రే చేసుకుంటే సువాసన వెదజల్లుతుంది. ఎక్కువగా కొడితే మొదటికే మోసం వస్తుంది. కొన్ని బ్రాండ్ల పెర్ఫ్యూమ్ బాటిళ్లపై ఎంత దూరం నుండి స్ప్రే చేయాలో రాసి ఉంటుంది. అలాంటి వాటిని అంతే దూరం నుండి శరీరంపై స్ప్రే చేసుకోవటం మంచిది.