Triphala Churnam : త్రిఫల చూర్ణం రోజు తీసుకుంటే డాక్టర్ తో పనిలేదా?..

చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది.

Triphala Churnam : త్రిఫల చూర్ణం రోజు తీసుకుంటే డాక్టర్ తో పనిలేదా?..

Triphala Churnam

Triphala Churnam : ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో కూడిన ఈ త్రిఫల చూర్ణం వాత,పిత్త,కఫ సమస్యలకు దివ్యఔషదంగా చెప్పవచ్చు. ప్రతిరోజు త్రిఫల చూర్ణం తీసుకుంటే వైద్యునితో అవసరం ఉండదని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలగి ఉంది.

చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కరక్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణమును త్రిదోష రసాయనంగా పిలుస్తారు.వాతం నాడీ వ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించింది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫల చూర్ణానికి ఉంది.

ఉసిరి, తానికాయ, కరక్కాయల గురించి వివరంగా చెప్పాలంటే..

ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియాలు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు.తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటుంది. దీనిలో విటమిను ‘ఏ’ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది. త్రిఫల చూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతిలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్ని ఇస్తుంది.

పిత్త దోషం కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. కఫ దోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు వస్తాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం తీసుకోవటం మంచిది. ప్రేగు గోడలకు కొత్త శక్తిని ఇచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టును త్వరగా తెల్లగా అవ్వనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది. ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది. యూరినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది. సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.

అంతే కాకుండా త్రిఫల చూర్ణం తీసుకోవటం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. పెద్ద ప్రేవులను శుభ్రంగా ఉంచి, పెద్ద ప్రేవులకు వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. ఎలర్జీని అదుపులో ఉంచుతుంది. కాన్సరు కణములు పెరగకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.