Doctors Caution: తస్మాత్ జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు డాక్టర్ల హెచ్చరిక!

కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే.. మరో ప్రమాదం హైదరబాద్ వాసులను కలవరపెడుతోంది.

Doctors Caution: తస్మాత్ జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు డాక్టర్ల హెచ్చరిక!

Dengue Danger: కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునేలోపే.. మరో ప్రమాదం హైదరబాద్ వాసులను కలవరపెడుతోంది. వర్షాకాలం రాకతో వర్షాలు కారణంగా రోడ్లపై నీరు ఆగడం, ట్యాంకులు, నీళ్లు నిల్వచేసే తొట్టెలు, నిల్వ కుండలు మరియు ట్రేలు, పశుగ్రాసానికి సంబంధించిన ప్రదేశాల్లో.. చెత్తలో ప్లాస్టిక్‌లలో నీరు చేరడం వంటి దోమలు పెరుగుతున్నాయి. ఈ ప్రదేశాల్లో పెరిగిన దోమల వల్ల నగరంలో డెంగ్యూ వ్యాప్తి చెందుతున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.

ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా డెంగ్యూ సోకుతున్నట్లుగా డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. జ్వరాలతో ఎక్కువగా పిల్లలు ఆస్పత్రులకు వస్తుండగా.. వారిలో ఎక్కువగా డెంగ్యూ సోకినవాళ్లు ఉన్నట్లుగా చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులకు కారమయ్యే దోమల సంఖ్య నిరంతరం పెరుగుతుందని, ఇలా పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.

నగర ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి ఇటీవల జరిపిన డ్రైవ్‌లో, ఖాళీ సిమెంట్ ఫ్లవర్‌పాట్స్‌లో, కార్మికుల ఉపయోగం కోసం నీటిని నిల్వచేసే నిర్మాణ ప్రదేశాలలో మరియు తాగునీటి అవసరాల కోసం బయట ఉంచిన నీటినిల్వ ట్యాంకుల్లో దోమల సంతానోత్పత్తి విపరీతంగా పెరగుతున్నట్లుగా గుర్తించారు. గతేడాదితో పోలిస్తే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. నగరపౌరులు దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

డాక్టర్ల వద్దకు వచ్చే మెజారిటీ కేసుల్లో ప్లేట్‌లెట్‌ కౌంట్ బాగా పడిపోయిందని, గాల్ బ్లాడర్ ఇన్‌ఫెక్షన్స్ కనిపిస్తున్నాయని చెబుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి రోగాలు రాకుండా ఉండాలంటే దోమలను పూర్తిగా నియంత్రించాలని సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ నీరు లేకుండా, పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి లేకుండా చూసుకుంటూ.. ఇంటి మూలల్లో తరుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచనలు చేస్తున్నారు.