botsa satyanarayana: బైజూస్ అంటే చంద్రబాబుకు తెలుసా?: మంత్రి బొత్స ఎద్దేవా

బైజూస్ యాప్‌తో ఏపీ స‌ర్కారు ఒప్పందం కుదుర్చుకున్న విష‌యంపై కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

botsa satyanarayana: బైజూస్ అంటే చంద్రబాబుకు తెలుసా?: మంత్రి బొత్స ఎద్దేవా

Botsa On Chandrababu

botsa satyanarayana: బైజూస్ యాప్‌తో ఏపీ స‌ర్కారు ఒప్పందం కుదుర్చుకున్న విష‌యంపై కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అమరావతిలో బొత్స సత్యనారాయణ నేడు మీడియాతో మాట్లాడుతూ… దేశ రాజకీయాల్లో పనికిమాలిన వారెవ‌రైనా ఉంటే అది చంద్రబాబే అని అన్నారు. పనికిమాలిన అనే పదం పేటెంట్ హ‌క్కు కూడా చంద్రబాబుదే అంటూ ఎద్దేవా చేశారు.

Agnipath: రేపు జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్న కాంగ్రెస్
చంద్రబాబు త‌న‌ను తాను కాపాడుకోవటం కోసం ఎటువంటి ప‌నులు చేశారో త‌మ‌కు తెలుస‌ని అన్నారు. బైజూస్ అంటే చంద్రబాబుకు తెలుసా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. బైజూస్‌లో జూస్ ప‌దం ఉంద‌ని, దాన్ని చంద్ర‌బాబు నాయుడు హెరిటేజ్‌లో దొరికే జ్యూస్ అనుకుంటున్నారా అని బొత్స చుర‌క‌లంటించారు. బైజూస్ యాప్ వల్ల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గదని చెప్పారు. ఉపాధ్యాయుల‌కు కూడా స్పోకన్ ఇంగ్లిష్‌లో శిక్ష‌ణ ఇస్తామ‌ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఆయ‌న చెప్పారు.

Agnipath: ‘అగ్నిప‌థ్‌’ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ వ‌స్తోన్న వేళ.. రాజ్‌నాథ్ నేడు కీల‌క భేటీ

పేద‌వారి పిల్ల‌ల‌కు ఇంగ్లిష్ చదువులు వద్దా అని ఆయ‌న నిల‌దీశారు. చంద్రబాబుకు ఖాళీగా ఉండటం అలవాటయిందని, అందుకే మతిపోయిందని ఆయ‌న ఎద్దేవా చేశారు. సహనం కోల్పోయి పిచ్చోడిలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. విజయనగరం జిల్లాకు వెళ్లి చంద్ర‌బాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నార‌ని బొత్స స‌త్య‌నారాయణ అన్నారు. సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధ‌మా అని ఆయ‌న స‌వాలు విసిరారు. విశాఖపట్నం అబివృద్ధి రాజశేఖర్ రెడ్డి వల్లే జరిగిందని ఆయ‌న చెప్పారు.

agnipath: సికింద్రాబాద్‌లో ప‌లు రైళ్ళు ర‌ద్దు.. హింస ఘ‌ట‌న‌లో దర్యాప్తు ముమ్మరం

చంద్రబాబు బాష, వ్యవహారం చూస్తే ఆయన పని అయిపోందని అందరికీ అర్థ‌మవుతుందని అన్నారు. బీజేపీ ఒంటెద్దు పోకడతో పోతుందని ఆయ‌న విమ‌ర్శించారు. అగ్నిపథ్‌ అల్లర్లను ప్రతిపక్షాలపై రుద్దడం సరికాదని అన్నారు. విదేశీ శక్తులు అల్లర్లు చేయిస్తున్నాయంటూ కొంద‌రు అంటున్నార‌ని, మ‌రి వాటిని అడ్డుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్ర‌శ్నించారు.