Covid-19 Heart attack Risk : కరోనాతో హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందా? వైరస్ సంకేతాలపై వైద్యులు హెచ్చరిక

కరోనావైరస్ వ్యాధి (కొవిడ్-19) సెకండ్ వేవ్ భారతదేశాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలో అన్ని వయస్సులవారికి వేగంగా కరోనావైరస్ వ్యాపిస్తోంది. కరోనా బారిన పడేవారిలో ఎక్కువగా గుండెజబ్బులు ఉన్నవారికి ఎక్కువ ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Covid-19 Heart attack Risk : కరోనాతో హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందా? వైరస్ సంకేతాలపై వైద్యులు హెచ్చరిక

Does Covid 19 Increase Risk Of Heart Attack Doctors Warning Signs

Covid-19 Heart attack Risk warning Signs : కరోనావైరస్ వ్యాధి (కొవిడ్-19) సెకండ్ వేవ్ భారతదేశాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలో అన్ని వయస్సులవారికి వేగంగా కరోనావైరస్ వ్యాపిస్తోంది. కరోనా బారిన పడేవారిలో ఎక్కువగా గుండెజబ్బులు ఉన్నవారికి ఎక్కువ ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వైరస్ సంకేతాలు, నివారణ చర్యలపై కూడా సూచనలు చేస్తున్నారు. కరోనా బాధితుల్లో చాలామందిలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర లేనివారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.

డేంజర్‌లో గుండెజబ్బు బాధితులు :
కరోనాతో గుండెజబ్బులు ఉన్నవారికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీరికే ప్రాణాపాయం అధికమంటున్నారు వైద్య నిపుణులు.. కనీసం 15-20శాతం మంది బాధితులు వారి గుండెలో వైరస్ ప్రభావానికి గురవుతున్నారని కార్డియాలజిస్ట్ వైద్యులు గుర్తించారు. గుండె సంబంధిత అనారోగ్య చరిత్ర ఉన్న బాధితులు లేదా వారి గుండెలో స్టెంట్లు ఉన్నవారు లేదా బైపాస్ సర్జరీ చేయించుకున్న వారెందరో ఉన్నారు. వీరంతా కరోనా బారిన పడిన తర్వాత తీవ్ర లక్షణాల కారణంగా అత్యవసర వైద్యం అవసరం పడుతుందని గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. గుండె జబ్బులు లేని కరోనా బాధితుల్లో కూడా గుండెనొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు గుర్తించామని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ తెలిపారు. సకాలంలో వైద్య సాయం అందితే వీరి ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం గుండెనొప్పి చాలా తీవ్రంగా ఉంటోందని తెలిపారు. వారిలో గుండె పనితీరు 10శాతం నుంచి 15శాతానికి పెరగడం ద్వారా ప్రాణాంతకంగా మారుతుందని ట్రెహాన్ చెప్పారు.

యువకుల్లోనే హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ.. :
కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది.. గుండె జబ్బుల చరిత్ర ఉన్న వృద్ధుల కంటే యువకులే ఎక్కువగా కరోనాకు బలైపోతున్నారని ట్రెహాన్ చెప్పారు. యువ రోగులు అకస్మాత్తుగా పల్మనరీ ఎడెమా సమస్యను ఎదుర్కొంటున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. ఊపిరితిత్తుల కణజాలం, గాలితిత్తుల్లో ద్రవం చేరడం, శ్వాస తీసుకోలేకపోవడం ద్వారా చివరికి శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుందని అంటున్నారు. వీరిలో దాదాపు 70శాతం మందికి తీవ్రమైన మయోకార్డిటిస్ (గుండె కండరాల వాపు) వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి వారు బతకడం చాలా కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ వైరల్ వేవ్ మొదటిదానికి భిన్నంగా ఉంది. 33 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుల్లో గుండె జబ్బుల సంకేతాలు లేకుండానే ప్రాణాలు తీసేస్తుందని ఆయన తెలిపారు.

సకాలంలో వైద్యసాయంతో ప్రాణాలు కాపాడొచ్చు :
కరోనాతో గుండెపోటు వచ్చిన బాధితులను సకాలంలో వైద్యసాయం అందించాల్సి ఉంటుంది. అలాంటి రోగులను ఆసుపత్రికి పంపించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. అలాంటి రోగులను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లితే బతికే అవకాశం ఉంటుందని అంటున్నారు. మహమ్మారి సమయంలో యువత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కేవలం వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికే ముప్పు కాదని వైద్యులు హెచ్చరించారు.

ఆందోళనే అసలు సమస్య.. ఒత్తిడి తగ్గించుకోండి :
కరోనావైరస్ బారిన పడిన బాధితుల్లో ఆందోళన కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ ట్రెహాన్ అన్నారు. ఆందోళనతో శరీరంలో ఆడ్రినలిన్ పెరిగేలా చేస్తుంది. తద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఈ ప్రక్రియలో హృదయ స్పందన రేటు పెరుగుతుంది.. వైరస్ సోకిన రోగికి ఇది చాలా హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కరోనా బాధితులు ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి మూడు-దశల విధానాన్ని అనుసరించాలని డాక్టర్ సూచించారు. ఒకటి.. మీ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామం చేయాలన్నారు. రెండోది.. ప్రతిరోజూ డి-స్ట్రెస్సింగ్ టెక్నిక్స్ చేయాలి.. మూడోది.. ప్రతిరోజూ కనీసం 30-40 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.. ఆరోగ్యకరమైన పోషకాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చునని సూచిస్తున్నారు. యోగా, శ్వాసపరమైన వ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్ సైజులు) చేయాలని సూచించారు.

హెచ్చరిక సంకేతాలివే :
ప్రతి గుండెజబ్బు కలిగిన బాధితుడు హెచ్చరిక సంకేతాలపై అవగాహన కలిగి ఉండాలని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు. ముందుగా గుండె జబ్బులు ఉన్నవారు బరువు లేదా పల్స్ ఆక్సిమీటర్‌లో వారి ఆక్సిజన్ సాచురేషన్ ఒకేసారి తనిఖీ చేయాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులను తేలికగా తీసుకోకకూడదని అన్నారు. వెంటనే వైద్యుని సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చునని తెలిపారు.

హృదయ రోగులకు సురక్షితమైన వ్యాక్సిన్లు :
కరోనా టీకాలు గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు సురక్షితమని డాక్టర్ ట్రెహాన్ స్పష్టం చేశారు. రక్తం పలచబడానికి తీసుకునే మందుల గురించి వ్యాక్సిన్ వేసేవారికి ముందుగానే తెలియజేయాలని సూచిస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తిపై టీకా మోతాదులను నిర్దిష్ట పద్ధతిలో ఇవ్వడానికి శిక్షణ ఇస్తారు. టీకా వేసిన ప్రదేశంలో మూడు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిరంతరం రుద్దుతుండాలి.

అత్యవసరాల్లో తప్ప ఆస్పత్రికి వెళ్లొద్దు :
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రికి వెళ్లవద్దని డాక్టర్ ట్రెహాన్ విజ్ఞప్తి చేశారు. కరోనాతో బాధపడుతున్న చాలా మంది బాధితులు తమ మందులను సకాలంలో ప్రారంభిస్తే ఇంట్లోనే కోలుకుంటారని చెప్పారు. RT-PCR రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వెంటనే మీ స్థానిక వైద్యుడిని సంప్రదించి మందుల కోర్సు వాడటం మొదలుపెట్టాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ఆదివారం నాటికి 403,738 కొత్త కేసులు నమోదు కాగా.. 4,092 మరణాలు నమోదయ్యాయి. దాంతో దేశంలో మొత్తంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య 22,296,414 కు చేరింది.