Narayan Jagadeesan: విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత.. 50 ఓవర్లలో 506 పరుగులు చేసిన తమిళనాడు.. దినేష్ కార్తీక్ విమర్శలు

విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఏకంగా 50 ఓవర్లలో 506 పరుగులు సాధించింది. నారాయణ్ జగదీషన్ అనే బ్యాటర్ అయితే, 141 బంతుల్లోనే 271 పరుగులు చేశాడు.

Narayan Jagadeesan: విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల మోత.. 50 ఓవర్లలో 506 పరుగులు చేసిన తమిళనాడు.. దినేష్ కార్తీక్ విమర్శలు

Narayan Jagadeesan: దేశవాలీ క్రికెట్ టోర్నీలో సోమవారం సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సోమవారం తమిళనాడు-అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లొ రికార్డు స్కోర్ నమోదైంది. 50 ఓవర్ల‌ వన్డే మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఏకంగా 506 పరుగులు చేసింది.

Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు

తమిళనాడు బ్యాటర్ నారాయణ్ జగదీషన్ డబుల్ సెంచరీ సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. మరో బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో తమిళనాడు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 506 పరుగులు సాధించింది. నారాయణ్ జగదీషన్ 141 బంతుల్లోనే 271 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ సాయి సుదర్శన్ 102 బంతుల్లో 154 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అద్భుత ప్రదర్శనపై భారత స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జగదీషన్‌ను అభినందించాడు. అయితే, టోర్నీ నిర్వహణ తీరుపై విమర్శలు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి జట్టును తమిళనాడుకు పోటీగా దించడంపై విమర్శలు చేశాడు.

Uttar Pradesh: శ్రద్ధా హత్య తరహాలో యూపీలో మరో ఘటన.. మహిళను చంపి ఆరు ముక్కలుగా నరికిన మాజీ ప్రియుడు

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన జట్లను ఈ గ్రూపులో ఆడించడాన్ని దినేస్ కార్తీక్ తప్పుబట్టాడు. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. ఈ రాష్ట్రాల జట్లు ఎప్పట్నుంచో టాప్ జట్లుగా ఉన్న తమిళనాడు వంటి వాటితో పోటీ పడలేవు. అలాంటి జట్లను మెయిన్ టీమ్స్‌తో ఆడించడం సరికాదని డీకే అభిప్రాయపడ్డాడు. వాటిని వేరే గ్రూపులో ఉంచి ఆడించాలని సూచించాడు. ఈశాన్య రాష్ట్రాలపై ఇతర జట్లు ఆధితప్యం చెలాయిస్తూ, ఎక్కువ స్కోర్లు సాధిస్తాయని.. ఇది ఇతర జట్ల పాయింట్లపై ప్రభావం చూపుతుందని అన్నాడు.

వేరే జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే, ఈ రన్‌రేట్ ఆ జట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా నారాయణ్ జగదీష్… వన్డేల్లో అత్యధిక స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే తమిళనాడు కూడా ఈ ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది.