Obesity : స్థూలకాయం గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తుందా?

అధిక బరువు వల్ల ముఖ్యంగా మహిళల్లో వంధ్యత్వానికి అవకాశాలు పెరుగుతాయని తేలింది. స్థూలకాయం పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ కు కారణమౌతుంది. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. స్థూలకాయం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో అనుసంధానించబడి ఉంటుంది.

Obesity : స్థూలకాయం గర్భందాల్చే అవకాశాలను తగ్గిస్తుందా?

Obesity Affect Fertility

Obesity : అధిక బరువు, ఊబకాయంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. ఈసమస్య కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు పెరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు అధిక బరువు సంతానాతోత్పత్తిపై ప్రభావం చూపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అనేక మంది భార్యభర్తల్లో అదిక బరువు కారణంగా సంతనం కలిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అనేక అధ్యనాలు చెబుతున్నాయి. గర్భం ధరించడం , బరువు తగ్గడం ఎలా అనే దానిపై చాలా మంచి అనేక సలహాలు ఇస్తున్నప్పటికీ ఆరోగ్యకరమైన బరువు ఆరోగ్యకరమైన గర్భధారణను నిర్ణయించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఊబకాయం సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది?

లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఊబకాయం, అధిక బరువు వల్ల ముఖ్యంగా మహిళల్లో వంధ్యత్వానికి అవకాశాలు పెరుగుతాయని తేలింది. స్థూలకాయం పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్ కు కారణమౌతుంది. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. స్థూలకాయం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)తో అనుసంధానించబడి ఉంటుంది. అధిక బరువు,తక్కువ బరువు శరీరంపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ సంతానోత్పత్తి స్థాయిలపై ప్రభావం చూపుతుంది. తక్కువ బరువు మహిళల్లో అండాశయం పనిచేయక వంధ్యత్వానికి దారితీయవచ్చు. అలాగే నియంత్రణ లేకపోవడం వల్ల అండాశయాలకు గుడ్లు విడుదల చేసేలా చేసే హార్మోన్‌లను నియంత్రించే హైపోథాలమస్ గ్రంధి పనితీరుపై సైతం ప్రభావం పడుతుంది.

జీవనశైలి మార్పులు;

ఆరోగ్యకరమైన స్పెర్మ్, అండాలు సంతానోత్పత్తిని కలిగిస్తాయి. జీవనశైలిలో చిన్న మార్పులు సంతానోత్పత్తిపై మొత్తం సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. జీవనశైలి స్త్రీలు, పురుషుల పునరుత్పత్తి పనితీరుపై ప్రభావం చూపుతుంది, అలాగే సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, మరియు, ఆహారంలో లోపాలు వంధ్యత్వానికి దోహదం చేస్తాయి. పిల్లలను కనే వయస్సు, పోషకాహారం, బరువు, వ్యాయామం, మానసిక ఒత్తిడి, పర్యావరణ, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం, ఆల్కహాల్, కెఫిన్ వినియోగం,శరీర బరువు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే జీవనశైలి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. రోజూ ధూమపానం అలవాటు ఉన్న మహిళల్లో ముందస్తు రుతువిరతి, వంధ్యత్వానికి దారితీస్తుంది. ఇది గర్భస్రావాలు ,పుట్టుకతో వచ్చే లోపాలకు కూడా దారితీస్తుందని అంటున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పుల వల్ల గర్భవతి అయ్యే అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామాలు చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్ర పొవాలి. ధూమపానం అలవాటును మానుకోవాలి. మద్యాన్ని పరిమితం చేయాలి. శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి. వైద్యుల సూచనలు సలహాల మేరకు ఫోలిక్ యాసిడ్, అయోడిన్ సప్లిమెంట్లను తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల స్థూలకాయ సమస్య నుండి బయటపడవచ్చు.