Blood On Spitting : ఉమ్మి వేసినప్పుడు రక్తం కనిపిస్తుందా? కారణాలు తెలుసా!

దగ్గిన ప్పుడు , ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తంలో కనిపిస్తే వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లె రంగు, రక్తం పడిన సందర్భం లాంటి విషయాలను పరిగణాలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పొగ తాగేవారిలో అదే పనిగా దగ్గువస్తుంది. వీరు ఉమ్మిన సందర్భంలో కళ్లెలో నెత్తురు కనిపిస్తుంది.

Blood On Spitting : ఉమ్మి వేసినప్పుడు రక్తం కనిపిస్తుందా? కారణాలు తెలుసా!

spitting up show blood (1)

Blood On Spitting : ఉమ్మి వేసినప్పుడు కొంత మందిలో నెత్తురు పడుతుంది. అలాగే ముక్కునుంచి రక్తం కారే సందర్భాలు ఉంటాయి. దంతదావనం చేసే సందర్భంలో బ్రష్‌తో బలంగా రుద్దినప్పుడు చిగుళ్లకు గాయం కావడం వల్ల రక్తం కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస మార్గంలో ఎక్కడైనా ఇన్‌ ఫెక్షన్‌ వల్ల ఉమ్మిలో నెత్తురు కనిపించే అవకాశాలు ఉంటాయి. కళ్లెలో రక్తం పడటానికి మరొక ప్రధాన కారణం ఏమిటంటే గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయాణించటం. ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకటం వల్ల సైతం కళ్లెలో రక్తం కనిపించటం జరుగుతుంది.

దగ్గిన ప్పుడు , ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తంలో కనిపిస్తే వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లె రంగు, రక్తం పడిన సందర్భం లాంటి విషయాలను పరిగణాలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పొగ తాగేవారిలో అదే పనిగా దగ్గువస్తుంది. వీరు ఉమ్మిన సందర్భంలో కళ్లెలో నెత్తురు కనిపిస్తుంది. మొదటి సారి కళ్లెలో నెత్తురు కనిపిస్తే చాలా మంది లైట్ తీసుకుంటారు. అయితే తరువాత అది జ్వరం, ఛాతీలో నొప్పి, కాళ్లలో అసౌకర్యం వంటి సమస్యలకు చివరకు ఊపిరితిత్తులకు కేన్సర్‌ కు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

విపరీతంగా దగ్గినప్పుడు ఉమ్మిలో నెత్తురు పడటం వంటి లక్షణాలు ఊపిరితిత్తుల కేన్సర్‌ లో కనిపిస్తాయి. కేన్సర్‌ తాలూకు గడ్డ ఊపిరితిత్తులనిండా వ్యాపిస్తున్న కొద్దీ మీకు ఊపిరి అందకపోవడం, గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి ఉంటాయి. అలాగే ఊపిరితిత్తుల మార్గంలో ప్రమాదకరం కాని పులిపిరులు ఉన్నవాళ్లయితే అది లంగ్‌ కేన్సర్‌ కాకపోయే అవకాశం ఉంది. అప్పుడప్పుడూ స్వల్పంగా ఊపిరి అందకపోవడం, గుండె దడ ఉంటాయి. ఒక కాలు వాచి, ముట్టుకుంటే నొప్పి పెడుతుంది. ఇవన్నీ ఊపిరితిత్తుల్లో గడ్డ ఉండటానికి సూచనలు. ఈ గడ్డను పల్మొనరీ ఎంబాలిజమ్‌ అంటారు.

క్షయ కారణంగా ఉమ్మి వేసినప్పుడు రక్తం పడే అవకాశాలు ఉంటాయి. కొద్ది రోజులు, వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే టిబి లేదంటే, క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించవచ్చు. రోగులు దగ్గినప్పుడు దుర్వాసనతో కూడిన కఫం పడుతుంది. కఫంలో నెత్తురు పడేఅవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా లేదా వైరస్‌ వల్ల కఫంలో రక్తం కనిపించవచ్చు.

అలాగే ఉమ్మిలో రక్తం పడటానికి గుండె సమస్యలు కారణం కావచ్చు. గుండె జబ్బుల కారణంగా గుండె బాగా బలహీనపడి, ఊపిరితిత్తులలో రక్తం నిలువ అయ్యే అవకాశం ఉంది. ఈ రోగులు ముఖ్యంగా శ్వాస పీల్చుకోవా లంటే వెనక దిళ్లను పేర్చుకుని కుర్చీలో కూర్చో వాల్సి వస్తుంది. వీరికి దగ్గు సాధారణం. కఫం నురగలాఉండి, రక్తం చిహ్నాలు కనిపిస్తాయి.