కుక్కను నడిరోడ్డుపై లాక్కెళ్లాడు

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 11:02 AM IST
కుక్కను నడిరోడ్డుపై లాక్కెళ్లాడు

Dog Tied To Car, Dragged On Road In Kerala : జంతువుల పట్ల కొంతమంది హీనంగా ప్రవర్తిస్తున్నారు. జాలి, దయ అనేది లేకుండా..క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే..ఓ వ్యక్తి పెంపుడు కుక్కను దారుణంగా హింసించాడు. కారుకు కట్టి నడి రోడ్డుపై లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చేసిన పని పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో యూసఫ్ అనే వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ పెంపుడు కుక్క ఉంది. బాగా విసిగిస్తోందని,..ఎక్కడైనా విడిచిపెడుదామని అనుకున్నాడు. ఎవరికైనా ఇవ్వడమో..జంతుశాల వారికి ఇవ్వడమే చేయకుండా..కారు వెనుక భాగంలో కుక్కను తాడుతో బంధించి..బరబరా లాక్కెళ్లాడు. కారు వేగానికి పరుగెత్తలేక యమబాధ పడింది. అయినా..అతను కనికరించలేదు. అదే సమయంలో ఓ బైకర్ వెళుతున్నాడు. ఘటనను అంతా వీడియోలో బంధించాడు. ఎలాగో కారును అడ్డగించాడు.

ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. కుక్కకు కట్టిన తాడును వదిలేసి..యూసఫ్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు యజమాని యూసుఫ్ పై చెంగమండ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే..చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశామని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.